Heavy Rains In AP: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండితున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు.. క్లైమెట్ ఎలా ఉండబోతుందో భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం (Amaravati Meteorological Department) వెల్లడించింది.
మూడు రోజులు ఎండలు..
ప్రస్తుతం ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు.. వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. వచ్చే మూడు రోజులు కూడా ఎండలు మండిపోతాయని తెలిపింది. ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమలోని చాలా ఏరియాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. వచ్చే ఐదు రోజుల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చని చెప్పింది.
ఆ ఏరియాల్లో వర్షం..
ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణం కేంద్రం చెప్పింది. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని IMD అమరావతి అభిప్రాయపడింది. అంతేకాకుండా ఉరుములతో కూడిన మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశమున్నట్లు చెప్పింది.
Also Read: Ponnam Prabhakar: దుబాయిలో బాధితుడు.. రంగంలోకి మంత్రి.. సర్వత్రా ప్రశంసలు
రాయల సీమలో జల్లులు
రాయల సీమలోని ఒకట్రెండు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములుతో కూడిన జల్లులు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాబట్టి ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.