Deputy CM Pawan Kalyan (imagecredit:swetcha)
ఆంధ్రప్రదేశ్

Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో తమిళనాడు రాజకీయ నాయకుడు కె.ఎస్.రాధాకృష్ణన్ భేటీ..

Deputy CM Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కె.ఎస్.రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాష సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చించారు.  పర్యావరణపరమైన విషయాల్లో, రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను రాధాకృష్ణన్ తెలియచేశారు.

Also Read: SVSN Varma Tweet: పవన్ పర్యటన.. మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ట్వీట్..

పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి, నెడుమారన్, ఈవీకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు.

పవన్ కళ్యాణ్ సత్కరించి కరుంగాలి కంబు ను బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ పవన్ కల్యాణ్  వివరించారు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?