Ramya Gopal: మొన్నటి వరకు సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు మారు మోగింది. మీ పచ్చడి రేట్లు ఏంటి మరి ఇంత ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకు.. కస్టమర్లు అని చూడకుండా.. పికిల్స్ యజమాని అలేఖ్య బూతులతో పచ్చిగా తిట్టేసింది.
పచ్చళ్లు గురించి కాకుండా .. వాట్సాప్ లో అసభ్యపదాలు మాట్లాడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి క్షణాల్లో వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం ఊపేసింది. రేటు గురించి అడిగితే దాని గురించి చెప్పాలి కానీ, బూతులు ఎలా తిడతారంటూ ఆమెపై అందరూ విరుచుకుపడ్డారు. అయితే, తాజాగా అలేఖ్య చెల్లి రమ్య గోపాల్ కంచర్ల యూట్యూబ్ లో వీడియో రిలీజ్ చేసింది.
అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాలో కాస్తా సైలెంట్ అవ్వడంతో ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య గోపాల్ కంచర్ల ఒక వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఎక్స్ పోజింగ్ చేస్తూ.. బిజినెస్ బాగా రన్ చేసేస్తుంది, తెల్ల తోలు చూసుకుని బాగా రెచ్చిపోతుంది, ప్రొఫెషనల్ లైఫ్ కి , పర్సనల్ లైఫ్ కి తేడా ఇది అంటూ కొత్త వీడియోలో క్లారిటీ ఇచ్చింది. కొన్ని పాత వీడియోలు చూపిస్తూ నేను ఎక్కడ బాడీని చూపించా.. ఎక్కడ స్కిన్ షో అయిందో నాకు అర్ధం కావడం లేదు. ఎక్కడ బ్యాడ్ గా కనిపిస్తుందో చెప్పండి. ఇప్పటి వరకు నేను చూపించిన వీడియోలో ఎక్కడ వల్గారిటీ ఉందో చెప్పండి. నోటికి ఏది వస్తే అది అనేస్తారు. ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది.
అంటూ మండి పడింది. నేను ఇండస్ట్రీలో ఉన్నా .. నటన అంటే చాలా ఇష్టం. దాని కోసం నాకు నచ్చిన డ్రస్సులు వేసుకుంటా.. నచ్చిన ఫుడ్ తింటాను అంటూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.