Protest Against Pahalgam Attack: పాకిస్తాన్ ఉగ్రమూకలపై సర్జికల్ స్ట్రైక్ జరగాలని డాక్టర్ కందుల నాగరాజు డిమాండ్ చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మానుకోటలో భారత్ వికాస్ పరిషత్, నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక భగత్ సింగ్ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ వరకు కొవ్వత్తులతో జోహార్ అమరవీరులకు అనే నినాదాలుచేస్తూ ర్యాలీ నిర్వహించారు.
Also Read: Nadendla Manohar: ఉగ్ర దాడులకు నిరసనగా మానవ హారం.. మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ సందర్భంగా నేతాజీ సేవా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ… ఈ ఉగ్ర దాడికి మన దేశంలో ఉన్న కొన్ని తీవ్రవాద ప్రేరేపిత శక్తులు పాకిస్తాన్ ఉగ్ర వాదులతో చేతులు కలిపి కాశ్మీర్ యొక్క పర్యాటక రంగాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి దాడులు చేయిస్తున్నారని, ఈ దాడి చేసిన వారిని, దాడికి సహాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యాత్రికులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.
విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్ము కేశవరావు మాట్లాడుతూ.. పహల్గాం అనేది వేరే దేశంలో లేదని, మన దేశంలో ఒక అంతర్భాగమని భారతీయులందరూ ఐక్యంగా ఉండి ఈ దాడికి నిరసన తెలపాలంటు, విదేశీ వస్తువులను బహిష్కరించాలని కోరారు. ఈ ర్యాలీలో నేతాజీ సేవాసమితి సభ్యులు లక్ష్మణ్, వివేక్, గంగాధర్, మైస రోహిత్, సామ శ్రీనివాస్, భవిరిశెట్టి శ్రీనివాస్, భారత్ వికాస్ పరిషత్ మానుకోట శాఖ బాధ్యులు నాగేందర్, ప్రభాకర్ రెడ్డి, జయ ప్రకాశ్, ఆవుల శ్రీనివాస్, విశ్వనాథం, పున్నం చంద్, భూపాల్ రెడ్డి, సఖి మండలి మహిళా మూర్తులు పద్మ, ఆర్తీ , మంగ, జ్యోతి, రాజశ్రీ, కోమల్ , విష్ణుకాంత, మంజు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు