Chandrababu Health Tips: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని దిగ్గజ రాజకీయ నాయకుడిగా ఏపీ సీఎం చంద్రాబాబు (AP CM Chandrababu)కు పేరుంది. ఏడు పదుల వయసులోనూ ఆయన ఎంతో ఫిట్ గా ఉన్నారు. బహిరంగ సభల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా గంటల తరబడి అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. చంద్రబాబు వయసులో ఉన్న పొలిటిషియన్స్ తో పోలిస్తే ఆయన ఆరోగ్యపరంగా ఎంతో మెరుగ్గా ఉన్నారు. ఇటీవలే ఆయన తన 75వ జన్మదిన వేడుకలను (Chandrababu 75 Birthday Celebration) సైతం జరుపుకున్నారు. దీంతో చంద్రబాబు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి గల కారణమేంటన్న ప్రశ్న ప్రతీ ఒక్కరినీ వెంటాడుతోంది. అయితే తనలాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో వైరల్
పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇందుకోసం అది చేయండి? ఇది చేయండి? అని చెప్పేవాళ్లు సమాజంలో చాలామందే ఉన్నారు. అయితే చేసి మంచి ఫలితాలు సాధించిన వారు ఆరోగ్య సూత్రాలు చెబితే అది కచ్చితంగా నమ్మదగినవిగా ఉంటాయి. ఎంతో బాధ్యతయుతమై పొజిషన్ లో ఉన్న సీఎం చంద్రబాబు లాంటి ఆరోగ్యకరమైన వ్యక్తి ఆ మాటలు చెబితే.. ఆ సూత్రాలకు మరింత మైలేజీ వస్తుంది. నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో సీఎం చంద్రబాబు చెప్పిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఉప్పు, షుగర్ వినియోగాన్ని ఎంత తగ్గిస్తే అంతమంచిదని ఆయన సూచించారు.
View this post on Instagram
ఆరోగ్య సూత్రాలు..
నలుగురు సభ్యులు ఉండే ఒక కుటుంబం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో సీఎం చంద్రబాబు వైరల్ అవుతున్న వీడియోలో చెప్పారు. నెలకు 600 గ్రాముల ఉప్పు (Salt)ను మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే నెలకు 2 లీటర్ల వంట నూనె (Cooking Oil) ను మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పారు. 3 కేజీల వరకు చక్కెర (Suger) వినియోగిస్తే చాలా వరకూ అనారోగ్య సమస్యలు కంట్రోల్ లో ఉంటాయని ఆయన చెప్పారు. తద్వారా హైపర్ టెన్షన్ (Hyper Tension), ఓబెసిటీ (Obesity), మధుమేహం, బీపీ (Blood Pressure) వంటి సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చని చంద్రబాబు సూచించారు. అలాగే గుండె, కిడ్నీ, లివర్ సమస్యల నుంచి బయటపడవచ్చని స్పష్టం చేశారు.
Also Read: Sircilla Crime: కనీవినీ ఎరుగని ఘోరం.. పళ్లతో కొరికి.. గొడ్డలితో నరికి హత్యాచారం!
అరగంట వ్యాయమం తప్పనిసరి
ఏపీలోని ప్రతీ ఒక్కరిని చంద్రబాబు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. రోజులో కనీసం ఒక అరగంట వ్యాయమం (Exercise) చేయాలని సూచించారు. ఉదయమా, సాయంత్రమా అనేది మీ సౌలభ్యాన్ని బట్టి ఎంచుకొని.. ప్రతీ ఒక్కరు వాకింగ్ (Walking) చేయాలని చెప్పారు. అలాగే తప్పనిసరిగా ప్రాణాయామాన్ని ప్రాక్టిస్ చేయాలని చెప్పారు. లేదంటే ప్రార్థన (Meditation) చేసుకోవచ్చని చెప్పారు. ఇష్టమైన భగవతుండి జ్ఞానంలో ఒక అరగంట సేపు గడిపితే దాని వల్ల కలిగే ప్రయోజనం అంతా ఇంతా కాదని సీఎం చెప్పారు. ఇలా చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతమని సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తేల్చి చెప్పారు.