Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే బాగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్స్ లో వైరల్ అయ్యే వీడియోస్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ అలాగే ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
ప్రపంచంలో (World) ఏం జరిగినా క్షణాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాం. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ యువతికి సంబందించిన వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనిని మీరు చూశాక .. షాక్ అవ్వకుండా ఉండలేరు. మరి ఇంతకీ, ఆ వీడియోలోఆమె ఏం చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: NVSS Prabhakar: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ నేత పహల్ గావ్ దాడిని గుర్తు చేస్తూ హెచ్చరిక!
అమ్మాయి చూడటానికి అందంగా ఉంది. కానీ, ఆమె టేస్టే బాగ లేదు. ఎవరైన కుక్కను పెంచుకుంటారు లేక పిల్లిని పెంచుకుంటారు. ఇవి కూడా ఇష్టం లేకపోతే ఏదోక పక్షులను పెంచుకుంటారు. కానీ, ఈమె మాత్రం ఏకంగా కొండ చిలువను పెంచుకుంటుంది. ఏంటి ఇది నిజమేనా అని ఆలోచిస్తున్నారా .. నిజమే. ఓ 20 ఏళ్ల అమ్మాయి పెద్ద కొండ చిలువను బెడ్ మీద తనతో పడుకోబెట్టుకుని ఆటలు ఆడుతూ ముద్దాడుతుంది. మనం చిన్న పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆమె కూడా దానిని అలాగే చూసుకుంటుంది. ఇక కొండ చిలువ అయితే సైలెంట్ గా నిద్ర పోతుంది. ఇప్పటికీ ఈ వీడియోని 83 లక్షల మంది వీక్షించారు. వారిలో 11 లక్షల మంది లైక్ చేయగా, 8 లక్షల మంది షేర్ చేశారు.
ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ” నువ్వు ఆడ పులి కంటే డేంజర్ గా ఉన్నావు, అబ్బాయిలకే దానిని చూస్తుంటే భయం వేస్తుంది. ఇక అమ్మాయిలైతే భయపడి పారి పోతారేమో అంటూ కొందరు అంటుండగా, బాయ్ ఫ్రెండ్ ఎవరు దొకరలేదేమో ఏకంగా కొండ చిలువను తెచ్చుకుని ముద్దు చేస్తుంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు