Koragajja Movie Update
ఎంటర్‌టైన్మెంట్

Gopi Sundar: ‘కొరగజ్జ’తో ప్రయోగం చేశా.. ఇంతకీ ‘కొరగజ్జ’ అంటే ఏంటో తెలుసా?

Gopi Sundar: దక్షిణాది సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనదైన మార్క్‌ను ప్రదర్శిస్తున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్. ఆయన మ్యూజిక్ అందించిన ఎన్నో పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు మ్యూజిక్ అందిస్తున్న ఓ చిత్రం విషయంలో సరికొత్త ప్రయోగం చేశానని స్వయంగా ఆయనే చెబుతున్నారు. ఆ చిత్రం పేరే ‘కొరగజ్జ’ (Koragajja). సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వంలో త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు సంగీతం అందించడం తనకు ఓ ప్రత్యేకమైన అనుభవంగా గోపీ సుందర్ చెప్పుకొచ్చారు. అసలింతకీ ‘కొరగజ్జ’ అంటే ఏంటంటే..

Also Read- Sri Reddy: అయ్యబాబోయ్.. శ్రీరెడ్డిలో ఇంత మార్పా? మునిగిపోయిందిగా!

కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలోనూ, అలాగే ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవతే ‘కొరగజ్జ’. ఈ సినిమా ‘కొరగజ్జ’ దేవత చుట్టూ అల్లుకున్న కథతో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంగీతం పరంగా సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ను గోపీ సుందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో సరికొత్త ప్రయోగాల్ని చేశాను. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాతే నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. దర్శకుడికి నా పని, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు పని కల్పించింది. ఇలాంటివి రేర్‌గా వస్తుంటాయి. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది. ఆ సవాల్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాననే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

Koragajja
Koragajja

‘కాంతార’ సినిమా కంటే ఎంతో భిన్నంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు సుధీర్ అత్తవర్ (Sudheer Attavar) చెబుతున్నారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళలోని గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ‘కాంతార’ ఒకరిని మాత్రమే చూపించిందని, దీనిపై ఈపీ విద్యాధర్ శెట్టి సహాయంతో పరిశోధన చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చారు. ‘కాంతార’ (Kantara) తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మల్టీ లాంగ్వేజెస్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read- Gopichand: ‘సాహసం’ తర్వాత మరోసారి ఆ బ్యానర్‌లో గోపీచంద్ చిత్రం.. క్లాప్ పడింది!

‘కొరగజ్జ’ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయి, వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరచగా.. ఈ పాటలన్నింటికీ చిత్ర దర్శకుడు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించడం విశేషం. ఈ చిత్రంలోని పాటలను శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన గాయకులు పాడారు. ఇందులో కబీర్ బేడి, కొరియోగ్రాఫర్లు సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, దక్షిణాది నటులు భవ్య, శ్రుతి వంటి వారెందరో భాగమయ్యారని మేకర్స్ తెలిపారు. ఇదెలా ఉంటే, ఈ మూవీ ఆడియో రైట్స్ కోసం భారీ రేటుని చెల్లించేందుకు పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు