Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ నూతన చిత్రం ఏప్రిల్ 24, గురువారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. రీసెంట్‌గా శ్రీను వైట్ల కాంబినేషన్‌లో గోపీచంద్ చేసిన ‘విశ్వం’ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలై, తీవ్ర నిరాశను మిగిల్చింది. వాస్తవానికి ఈ సినిమా గోపీచంద్‌కే కాదు దర్శకుడు శ్రీను వైట్లకు కూడా ఎంతో ముఖ్యమైన చిత్రం. ప్రస్తుతం శ్రీను వైట్ల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ‘విశ్వం’ సినిమాతో మళ్లీ పుంజుకుంటాడని అంతా ఊహించారు. కానీ ఆయనకు ఇంకా లక్ కలిసి రావడం లేదు. ఆ సినిమా తర్వాత శ్రీను వైట్ల గురించి ఇండస్ట్రీలో మాట్లాడేవారే కరువయ్యారు. మరోవైపు గోపీచంద్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
Also Read- Sitara and Akira: పవన్ కళ్యాణ్ కుమారుడు.. మహేష్ బాబు కుమార్తె.. ఈ కాంబోలో మూవీ పడితేనా?
గోపీచంద్‌కి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఆయన కూడా ఒక సాలిడ్ హిట్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తే కానీ, మళ్లీ కొన్నాళ్ల పాటు ఆయనకు తిరుగుండదు. ‘విశ్వం’ సినిమా రిజల్ట్‌తో కొంత గ్యాప్ తీసుకున్న గోపీచంద్, తిరిగి మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గోపీచంద్ హీరోగా.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ, ఇంతకు ముందు గోపీచంద్‌లో ‘సాహసం’ (Sahasam) వంటి ఓ వైవిధ్యభరితమైన చిత్రం చేసిన సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (Sri Venkateswara Cine Chitra) బ్యానర్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం మొదలైంది. ఇంట్రస్టింగ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంతో కుమార్ సాయి (Kumar Sai) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో గోపీచంద్ చిత్ర పటాలపై క్లాప్ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం. 39వ చిత్రంగా నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సాహసం’ చిత్రం తర్వాత మరోసారి సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ఈ టీమ్‌తో జాయిన్ అయ్యారు. ఈ సినిమా గురించి టీమ్ తెలుపుతూ.. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం ఉంటుందని, అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని అన్నారు. గోపీచంద్ సరసన మలయాళ నటి మీనాక్షి దినేష్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని.. నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను మరో అప్డేట్‌తో తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు.
Also Read- SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా లీక్స్‌పై నాని షాకింగ్ రియాక్షన్!
ఈ సినిమా కచ్చితంగా గోపీచంద్‌కు మంచి విజయాన్ని ఇస్తుందని, ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యాక్షన్ నేపథ్యంలో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే హీరోలలో గోపీచంద్ ఒకరు. తన పరంగా సినిమాల్లో అన్నీ పాజిటివ్‌గానే ఉన్నా, కథ, కంటెంట్ విషయంలో మాత్రం ఆయన సినిమాలు గాడి తప్పుతున్నాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయనకు హిట్ రావడం లేదు. కానీ, ఈ సారి అద్భుతమైన కథతో, అనుకున్న రేంజ్ హిట్‌ని కొడతానని ఆయన నమ్మకంగా ఉన్నారు. చూద్దాం.. మరి ఈ సినిమా అయినా గోపీచంద్‌కి హిట్‌ని ఇస్తుందేమో..!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు