Sri Reddy
ఎంటర్‌టైన్మెంట్

Sri Reddy: అయ్యబాబోయ్.. శ్రీరెడ్డిలో ఇంత మార్పా? మునిగిపోయిందిగా!

Sri Reddy: ‘‘నా జీవితం డైలీ ఓ పోరాటం అయిపోయింది. చాలా చాలా అలసిపోయా. ఓపిక నశించింది. నా ఒక్కదాని వల్ల ఏ ఇండస్ట్రీలో ఏ మార్పు రాదు. ఒక మూసలో ఉన్నవాటిని కొత్తగా వచ్చిన మనమెవరం మార్చలేము. నా లాగా ఎదురించి మీ పేరు, మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఎవరిలో ఏ మార్పు రాదు. అంతా వేస్ట్. నా అనుకున్న వాళ్లు కూడా ఎవరినో స్క్రాప్‌ని ఎంకరేజ్ చేస్తారు తప్ప, మనల్ని పక్కన పడేస్తారు. నా జీవితం ఎందరికో పాఠం’’ అని శ్రీరెడ్డి ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. శ్రీరెడ్డిలో రోజురోజుకూ బీభత్సమైన మార్పు వస్తుందని నెటిజన్లు కూడా షాకవుతున్నారు.

Also Read- Gopichand: ‘సాహసం’ తర్వాత మరోసారి ఆ బ్యానర్‌లో గోపీచంద్ చిత్రం.. క్లాప్ పడింది!

వాస్తవానికి ఆమె వైసీపీ కోసం నిలబడిన తీరు చూస్తే, నిజంగా ఆమెకు పార్టీలో పెద్ద పదవి దక్కాలి. కానీ ఆమె నోటి దూల కారణంగా వైఎస్ జగన్ పక్కన పెట్టేశారు. అదే ఇప్పుడు ఆమె బాధ. యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలక పోస్ట్ ఇచ్చిన తర్వాత శ్రీరెడ్డిలో రియలైజేషన్ మొదలైంది. తనలాంటి ఫైర్ బ్రాండ్‌ని పక్కన పెట్టి, పైసాకు ఉపయోగం లేని వారికి పోస్ట్‌లు ఇవ్వడంపై శ్రీరెడ్డి బాగా హర్టయింది. అందుకే, ఇక రాజకీయాలకు, సోషల్ మీడియాలో గొడవలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా ఇటీవలే ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. నోరేసుకుని అరిస్తే, తనలాగే అందరి జీవితం అవుతుందని, ఎప్పుడూ అగ్రెసివ్‌గా రియాక్ట్ అవడం కూడా మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నట్లుగా ఆమె వెల్లడించింది. ఇప్పుడో అడుగు ముందుకు వేసి, వేదాంత ధోరణిలో ఆమె చేసిన పోస్ట్ (Sri Reddy Latest Post) మరోసారి ఆమెను వార్తలలో హైలెట్ చేస్తుంది.

‘‘కృష్ణాయ వాసుదేవాయ! జీవితంలో అసలు ఇంతకన్నా కష్టం ఉండదేమో అని తలచి అనుభవిస్తున్న ప్రతిసారి.. పాత పుండు మానకముందే, అంత కన్నా పెద్ద కష్టాన్ని నాకు వడ్డిస్తున్న గోవిందుడా, ఈ కష్టాలలో పడి ఎక్కడ నీ నామ సంకీర్తన మర్చిపోతానేమో అని భయంగా వుంది. నా చిన్ని కృష్ణా! అందరూ దూరమైపోయినా పర్వాలేదు, కానీ ఓ రఘుకుల తిలక నా శ్రీరామచంద్ర, నీ నామం ఒకటే నా తోడు ఉంటే చాలు స్వామీ’’ అని దేవుళ్లందరినీ తలచుకుంటూ, అన్ని వదిలి ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నట్లుగా శ్రీరెడ్డి ఓ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు ఎవరుపడితే వారు కామెంట్ చేయకుండా తను ఫాలో అయ్యేవారు మాత్రమే రియాక్ట్ అయ్యేలా, కామెంట్స్‌ని బ్లాక్ చేసింది.

Also Read- Sitara and Akira: పవన్ కళ్యాణ్ కుమారుడు.. మహేష్ బాబు కుమార్తె.. ఈ కాంబోలో మూవీ పడితేనా?

వైసీపీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు రెబల్‌గా రెచ్చిపోయిన శ్రీరెడ్డి, ఏపీలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో.. ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు (AP CM Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh) వంటి వారిని క్షమాపణలు కూడా కోరింది. అయినా సరే వారి ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ ఒకప్పుడు అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టినందుకు ఆమెపై పోలీస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం పూసపాటి రేగ పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నెల్లిమర్ల, అనకాపల్లిలో కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ల చుట్టూ శ్రీరెడ్డి తిరుగుతుంది. ఇలా తిరుగుతున్న విషయాన్నే ఇన్ డైరెక్ట్‌గా శ్రీరెడ్డి పై పోస్ట్‌లో పేర్కొంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్