Singer Pravasthi : ఎవరూ ఉహించని విధంగా సింగర్ ప్రవస్తి ఆరాధ్య మీడియా ముందుకొచ్చి పాడుతా తీయగా షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో, టాలీవుడ్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో కూడా వివక్షత ఉందా అంటూ కొత్త చర్చకు తెర లేపాయి. అయితే తాజాగా, శుభలేఖ సుధాకర్ దీనిపై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం, ఈ వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Singer Pravasti: గొడవ సరే.. ఇంతకీ మీ కులం ఏంటి? సింగర్ ప్రవస్తి పై నెటిజన్ల ప్రశ్నల వర్షం
ఎస్ పి శైలజ భర్త శుభలేఖ సుధాకర్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సింగర్ ప్రవస్తి వివాదం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ ” ఏ పని చేసిన రెండు ఉన్నాయి. స్వార్థంగా చేయడం, నిస్వార్థంగా చేయడం. ఎస్. పి బాల సుబ్రహ్మణ్యం నిస్వార్థంగా చేశారని అన్నాడు. ఆయన తపన ఏంటంటే .. కొత్త టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయాలి. ఇండస్ట్రీకి పరిచయం చేయాలి, వాళ్ళు రావాలి, ఎదగాలనే ఆలోచనతోనే మొదలు పెట్టారని చెప్పాడు. బాలు గారు అనుకున్నట్టుగానే వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ సీజన్స్ లో వచ్చినా వాళ్ళు ఈ రోజున ఎక్కడో ఒకచోట నిలుదొక్కుకున్నారు. మొత్తానికి ఆయన అనుకున్నది సాధించారు ” అని అన్నారు.
Also Read: Threat to Gambhir: చంపేస్తామంటూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు
ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు నిస్వార్థంగా చేయండి. ఇది నేను సహాయం చేస్తున్నాను, దీని తర్వాత ఎప్పుడైనా నీ అవసరం ఉంటే నాకు ఇది కావాలి అని ఎదో ఆశించి చేశామంటే అది సహాయం కాదని అన్నారు. అది వ్యాపారం అవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు,ఎం ఆ వ్యాపారానికి మీరు ముందే పెట్టుబడుతున్నారని అని అన్నారు. ” వీలుంటే సహాయం చెయ్.. కానీ, ఎవరికీ హానీ చేయోద్దు ” అని చెప్పారు. కానీ, ఈ రోజున ఉన్న ప్రపంచం రివర్స్ అయిపోయింది. సహాయం పక్కన పెట్టండి.. హాని మాత్రమే చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ బయట వాళ్ళు కాకుండా మీ వాళ్లు జడ్జెస్ గా ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేవి. ముందు సునీత, ఎమ్ ఎమ్ కీరవాణి పాడుతా తీయగా షో నుంచి తీసేయండి. మను, ఎస్ పి శైలజ జడ్జెస్ గా షో హిట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు