AP CM Chandrababu(image credit:X)
ఆంధ్రప్రదేశ్

AP CM Chandrababu: ప్రణాళిక ప్రకారమే దాడి.. పహల్గాం ఉగ్రదాడిపై సీఎం సీరియస్!

AP CM Chandrababu: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత-భద్రత విషయంలో ఏకతాటిపైకి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖపట్నం వెళ్లి సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు.. నివాళులు అర్పించారు. చంద్రమౌళి మృతదేహంపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది. విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారు. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ బి ఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారని ప్రత్యక్షసాక్షి శశిధర్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం.

అభివృద్ధిని చూసి ఓర్వలేక దాడులు

ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. నాలుగేళ్లుగా జమ్మూకాశ్మీర్ లో కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధి, అభివృద్ధికి నాంది పలకడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఈ సమయంలో ఉగ్రదాడి బాధాకరం. టెర్రరిస్టులు భారత్ ను ఏం చేయలేరు. మన దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో చేద్దామనుకోవడం వారి అవివేకం.

Also read: High Security In Tirumala: తిరుమలలో హైఅలర్ట్.. వాహనాల ముమ్మర తనిఖీలు.. ఎందుకంటే?

అమెరికా వైస్ ప్రెసిడెంట్ మన దేశానికి రావడం, మన ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో దాడి వెనుక కుట్ర కోణం ఉండే ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పడు దేశమంతా సమైక్యంగా నిలబడాలి. ప్రధాని మోదీ నాయత్వంలో కేంద్రం చేసే ప్రతి కార్యక్రమానికి సంఘీభావం తెలపాలి.

దేశ భద్రతను దెబ్బతీయాలని చూస్తే వారి ఆటలు సాగవు

దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తాం. మేధావులు, ప్రజలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. క్లిష్ట సమయంలో కేంద్రానికి పూర్తిగా సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

 

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్