తెలంగాణ: Meenakshi natrajan: బ్రిటిష్ వాళ్లను తరి మేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదని ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ లు ఎన్ని గేమ్ లు ఆడినా, కాంగ్రెస్ ను ఏమీ చేయలేవని క్లారిటీ ఇచ్చారు. ఆమె గాంధీభవన్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చాలా ఉన్నదని, బ్రిటిష్ వాళ్ళను దేశం నుంచి పారద్రోలిందన్నారు. విస్తృత భావజాలం ఉన్న పార్టీ అని, ఈ ఆలోచనలతో పనిచేసే జాతీయ స్థాయి పార్టీ మరోకటి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలతో నడుస్తుందన్నారు. పార్టీ సిద్ధాంత ప్రచారం,సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచే జరగాలన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో సీరియస్ గా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం గుజరాత్ మోడల్ గా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్తారంగా జనాల్లోకి తీసుకువెళ్లాలని, సిద్ధాంత పోరాటానికి సిద్ధాంగా ఉండాలన్నారు.
Also Read: Panta Bheema Scheme: రైతులకు శుభవార్త.. రాష్ట్రంలో పంటల భీమా పథకం!
దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో కుల గణన 42 శాత రిజర్వేషన్ ను అమలు చేస్తుందని, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం కూడా చారిత్రాత్మకమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.