Singer Sunitha (Image Source: X), Mango Media Ram
ఎంటర్‌టైన్మెంట్

Singer Sunitha: సింగర్ సునీత మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా? తెలిస్తే షాకవుతారు

Singer Sunitha: ప్రస్తుతం సింగర్ సునీత పేరు ఓ సింగింగ్ షో విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. బాడీ షేమింగ్ చేశారని, కురచ దుస్తులు ధరించాలని ఒత్తిడి చేశారని, వారు పాడమన్న పాటలు పాడలేదని ఎలిమినేట్ చేసినట్లుగా కీరవాణి, చంద్రబోస్, సింగర్ సునీతలపై సింగర్ ప్రవస్తి‌ ఆరోపణలు చేసింది. ‘పాడుతా తీయగా’ సింగింగ్ షో‌కు న్యాయ నిర్ణేతలుగా ఉన్న వీరిపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణతో రెండు రోజులుగా ఈ పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడిది పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఈ విషయంలో పలువురు సీనియర్ సింగర్స్.. ప్రవస్తి తప్పు మాట్లాడుతుందని, వాళ్లు అలాంటి వాళ్లు కాదని సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం వారిని టార్గెట్ చేస్తూ, లేనిపోని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Bromance OTT: ట్విస్టులతో కూడిన లాఫింగ్ రైడర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

అసలు ఈ విషయంలో వాస్తవం ఏమిటనేది తెలియాల్సి ఉంది. సింగర్ సునీత, ఆ షో నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఓ షోకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. కొన్ని పాటలకే అనుమతి ఉంటుంది. మ్యూజిక్ పరంగా వారికి ఇబ్బందులు ఉంటాయి. షో లో ఏ పాట పాడాలి? ఏ పాట పాడకూడదు? అనేది ముందే చెబుతారు. అలాంటి విషయాలేమీ చెప్పకుండా ప్రవస్తి ఏదేదో చెబుతుందని, ఇండస్ట్రీకి నేనేంటో తెలుసు? నేను ఎలాంటి దానినో కూడా తెలుసు? ఇంకా ఒళ్లో కూర్చో బెట్టుకుని జోల పాడుతూ చెప్పడానికి ప్రవస్తి చిన్నపిల్ల కాదు. ఆమె చేస్తున్న ఆరోపణలు తర్వాత నాకు అనిపిస్తుంది. ఇలా కూడా ఆలోచిస్తారా? అని అంటూ సింగర్ సునీత కూడా ఓ వీడియోను విడుదల చేసి, ప్రవస్తి మాటలను ఖండించింది. సింగర్ సునీత విడుదల చేసిన వీడియోపై ప్రవస్తి కూడా కౌంటర్ అటాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కాంట్రవర్సీ అలా కొనసాగుతూనే ఉంది.

Also Read- Padutha Theeyaga: ఎలాంటి ‘పాడుతా తీయగా’.. ఎలా అయిపోయింది? వుయ్ మిస్ యు బాలు సార్!

ఇదిలా ఉంటే, ఇప్పుడు సింగర్ సునీత పేరు మరో విషయంలో కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే, అలీ హోస్ట్ చేస్తున్న ఓ షో‌లో సింగర్ సునీత పాల్గొంది. ఆ షోలో హీరోలలో మీ ఫస్ట్ క్రష్ ఎవరని అలీ అడిగారు. దీనికి సునీత టాలీవుడ్‌కు చెందిన ఏదైనా హీరో పేరు చెబుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అందరికీ షాకిస్తూ.. బాలీవుడ్ హీరో పేరు చెప్పింది. అంతే అంతా అవాక్కయ్యారు. ఇంతకీ సింగర్ సునీత చెప్పిన తన క్రష్ ఎవరని అనుకుంటున్నారా? జాకీ ష్రాఫ్. ఆయన తనకంటే చాలా పెద్దవాడైనప్పటికీ, ఎందుకో తనంటే చాలా ఇష్టమని సునీత చెప్పుకొచ్చింది.

సునీత చెప్పిన మాటకు అలీ కంటిన్యూ చేస్తూ, జాకీష్రాఫ్‌తో నేను యాక్ట్ చేశాను. తను సినిమాలలోకి రాకముందు స్ట్రీట్ రౌడీగా ఉన్నానని, సినిమాలలోకి వచ్చిన తర్వాత తన తలరాత మారిపోయిందని జాకీ తనతో చెప్పినట్లుగా అలీ చెప్పారు. వెంటనే సునీత అందుకుని, ఆయన రౌడీ అయితే ఏంటి? నా మనసును దోచుకున్న హీరో తను అని సునీత సరదాగా చెప్పుకొచ్చారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రవస్తి మ్యాటర్‌తో సునీత పేరు హైలెట్ అవుతుండగా, ఈ వీడియో కూడా సునీత గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన వారంతా.. అదేంటి? టాలీవుడ్ హీరోలలో ఒక్కరూ నచ్చలేదా? అని కామెంట్స్ చేస్తుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!