Bromance OTT: కామెడీ ప్రధానంగా వచ్చే సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మ్యాగ్జిమమ్ స్పేస్ ఉంటుంది. ఆ విషయం ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలు నిరూపించిన విషయం తెలిసిందే. కామెడీతో పాటు కంటెంట్ కరెక్ట్‌గా పడితే రికార్డులు క్రియేట్ చేయవచ్చని ఈ సినిమాలు నిరూపించాయి. ఇప్పుడలాంటి ఓ చిత్రమే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందనను రాబట్టుకున్న హాస్యభరిత చిత్రం ‘బ్రొమాన్స్’. ట్విస్ట్‌లతో కూడిన ఈ హాస్యభరిత చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
‘బ్రొమాన్స్’ మూవీ సోనీ లివ్‌లో ఓటీటీలో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అలాగే ఆ మధ్య ఈ సినిమాపై రీమేక్ వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడా వార్తలన్నింటికీ తెరదించుతూ ఈ సినిమా మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు భాషలలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో ఈ మలయాళ సినిమాను మేకర్స్ తెరకెక్కించారు. థియేటర్స్‌లో ఈ సినిమాను చూడలేకపోయినవారు ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు ఇంట్లోనే చూసి ఆస్వాదించవచ్చని తెలుపుతూ ఓటీటీ సంస్థ ఈ చిత్ర స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించింది.
Also Read- Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై తీవ్ర ఒత్తిడి!
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ డి. జోస్ (Arun D Jose) మాట్లాడుతూ.. ‘బ్రొమాన్స్’ (Bromance) చిత్రాన్ని థియేటర్స్‌లో వీక్షించి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అందరి హృదయాలను హత్తుకున్న ఫ్రెండ్‌షిప్ కథతో రూపొందించాం. ఇందులో ఉన్న డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ఆదరించారు. కనిపించకుండా పోయిన ఓ స్నేహితుడిని వెతికే స్నేహితుల కథ ఇది. ఆద్యంతం ట్విస్ట్‌లతో సాగే ఈ సినిమా మే 1 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వస్తుండటం ఆనందంగా ఉంది. ఓటీటీలో ఈ చిత్రం మరింత మంది హృదయాలను ఆకట్టుకుంటుందని ఎంతగానో నమ్ముతున్నానని అన్నారు.
Also Read- Ghaati: ఏప్రిల్ 18 రిలీజ్ అన్నారు.. ఇంకెప్పుడు? ఈ ప్రాజెక్ట్‌లో అయినా క్రిష్ ఉన్నాడా?
‘బ్రొమాన్స్’ చిత్ర కథ విషయానికి వస్తే.. బింటో అనే యువకుడి కోణంలో ఈ సినిమా కథ నడుస్తుంది. బింటో తన సోదరుడి స్నేహితులతో కలిసి కనిపించకుండా పోయిన తన సోదరుడిని వెతకటానికి ప్రయత్నిస్తాడు. కథంతా ఓ రాత్రిలోనే జరుగుతుంది. ఊహించని ట్విస్టులు, మరచిపోలేని జ్ఞాపకాలతో నిండిన ప్రయాణంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. అరుణ్ డి.జోస్, రవీష్ నాథ్, థామస్ పి.సెబాస్టియన్ రాసిన ఈ కథను అషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఇందులో అర్జున్ అశోకన్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, మహిమ నంబియార్, మాథ్యూ థామస్, కలభవన్ షాజోన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ప్రధాన పాత్రలలో నటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు