Pahalgam Terrorist Attack: మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి నుంచి కొందరు పర్యాటకులు ప్రాణాలను అరచేత పట్టుకుని బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఉగ్రదాడిపై భారత్ సీరియస్‌గా ఉంది. తగిన ప్రతీకారం తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఉగ్రదాడి అనంతరం ప్రభాస్ సినిమాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదేంటి, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగితే, ప్రభాస్ సినిమాపై ఒత్తిడి ఏంటని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే..
రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా ‘సీతారామం’ (Sita Ramam) ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా చిత్రానికి ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. బాలీవుడ్ లెజండరీ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి జయప్రద కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చిత్రయూనిట్ ఈ సినిమాకు పేరు ప్రకటించకపోయినప్పటికీ, ‘ఫౌజీ’ (Fauji) అనేది ఈ చిత్ర టైటిల్‌గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా విషయంలోనే ఇప్పుడు తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్విని మేకర్స్ ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.
Also Read- Padutha Theeyaga: ఎలాంటి ‘పాడుతా తీయగా’.. ఎలా అయిపోయింది? వుయ్ మిస్ యు బాలు సార్!
ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రభాస్‌తో పాటు ఇమాన్వి (Imanvi Esmail) కూడా హాజరైంది. అయితే ఇప్పుడీ హీరోయిన్ విషయంలోనే ఈ సినిమాకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటంటే, ఇమాన్వి పాకిస్తాన్ మిలటరీ ఆఫీసర్ కుమార్తె అని, వారి ఫ్యామిలీ కరాచీలో ఉంటుందనేలా టాక్ వినబడుతుంది. అందుకే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సినిమాలో పాకిస్తాన్ మూలాలు ఉన్న నటిని ఎలా తీసుకుంటారు? అలా తీసుకుంటే ఈ సినిమాను బ్యాన్ చేస్తామనేలా కొందరు నెటిజన్లు సీరియస్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి.. మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నిజంగా ఆమెకు, పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు అనేలా ఏవైనా మేకర్స్ బయటపెడితే తప్పితే.. ఆమెనే హీరోయిన్ అంటే మాత్రం మేకర్స్‌కి భారీ లాస్ తప్పదు. చూద్దాం మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
Also Read- Ghaati: ఏప్రిల్ 18 రిలీజ్ అన్నారు.. ఇంకెప్పుడు? ఈ ప్రాజెక్ట్‌లో అయినా క్రిష్ ఉన్నాడా?
మ్యాసివ్ బ్లాక్‌బస్టర్స్ ‘సలార్, కల్కి 2898 AD’ తర్వాత ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతితో చేస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab)తో పాటు, హను రాఘవపూడితో చేస్తున్న ఈ ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్స్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇందులో ‘ది రాజా సాబ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఫౌజీ’ సినిమా కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 1940 హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి పోరాటం చేసే ఓ యోధుడి కథగా ‘ఫౌజీ’ ఉండబోతోందని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు