Kakinada student: ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలను ( AP SSC Results) ఈ రోజు ఉదయం 10గంటలకు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు. అయితే, ఈ ఏడాది మొత్తం 6,14,459 మంది స్టూడెంట్స్ హాజరు కాగా,4,98,585 మంది పాస్ అయ్యారని పేర్కొన్నారు.
విద్యార్థులందరూ తమకి వచ్చిన ఫలితాలను చూసుకునేందుకు నెట్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ ను అందరూ చెక్ చేసుకుంటున్నారు. అయితే, ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్స్..
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇదో రికార్డు అని చెప్పుకోవాలి. కాకినాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని యల్ల నేహంజిని (yalla Nehanjini) 600 కు 600 మార్కులు సాధించి సరి కొత్త రికార్డు క్రియోట్ చేసింది. ఇంత వరకు ఈ రికార్డు ఎవరూ సాధించలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టీరిలోనే మొదటి సారి. నూటికి నూరు శాతంతో పాస్ అయిన నేహంజినిని అందరూ అభిమానిస్తున్నారు. ఎంత బాగా రాసిన ఒక్క మార్క్ అయినా తగ్గుతుంది. కానీ, ఈ అమ్మాయికి వచ్చిన మార్క్ చూసి అధికారులు కూడా షాక్ అవుతున్నారు.ఈ అమ్మాయి సాధించిన మార్కులకు స్కూల్ యాజమాన్యం సంబరాలు జరుపుకుంటుంది.
విద్యార్ధులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి డోలా
10 వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్ధులకు అభినందనలు మంత్రి డోలా తెలిపారు. 593 మార్కులు సాధించిన పెదపావని గురుకుల విద్యార్థిని ఎస్. కవితను ప్రత్యేకంగా అభినందించారు. గురుకులాల, సంక్షేమ వసతి గృహాల్లో 90 శాతం ఉత్తీర్ణత వచ్చిందని వెల్లడించారు. గత 3 ఏళ్ల సగటుతో పోల్చితే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. విద్యార్దులు మరిన్ని విజయాలు సాధిస్తూ భవిష్యత్ లో ఉన్నత స్ధాయికి ఎదగాలని అన్నారు. పేదల విద్యకే కూటమి ప్రభుత్వం మెదటి ప్రాధాన్యతని తెలిపారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదివి సమాజంలో గొప్ప స్దాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి డోలా తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు