Vangalapudi Anitha (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

Vangalapudi Anitha: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విపత్తులు.. మంత్రి వంగలపూడి అనిత

అమరావతి: Vangalapudi Anitha:  గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఏపీకి విపత్తులు సంభవించాయని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చర, వడగాలులపై సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని, ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలని అన్నారు.

రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం వుందని గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని, రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. 2025 ఏప్రిల్‌లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా 2014,15,16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3,48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని అన్నారు. తాగునీటి అవసరాలపై హోంమంత్రి అనిత ఆరాతీశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నట్లు సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ తెలిపారు.

100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకెళుతున్నట్లు సీడీఎంఏ డైరెక్టర సంపత్ తెలిపారు. 92 మండలాలను ముందస్తుగా గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పాఠశాలల్లో నీటితో పాటు, ఎన్జీవో,విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ వడగాల్పుల ద్వారా వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం 5,145 పడకలను, 768 అంబులెన్సులు, సిద్ధం చేయడమే కాకుండా వైద్యులకు తగు శిక్షణనిచ్చి అప్రమత్తంగా ఉంచినట్లు వైద్యశాఖ అధికారి పేర్కోన్నారు.

Also Read: Anakapalle Crime: భర్త వేధింపులు.. పగ తీర్చుకున్న భార్య.. అనకాపల్లిలో దారుణం

వడదెబ్బ మరణాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత ఎండలు, వడగాల్పులపై అవగాహన పెంచాలన్న విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సచివాలయం, వార్డు సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20 నగరాలలో వడగాల్పుల అప్రమత్తత దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి వడాల్పులతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం, ముందస్తు వర్షాలు వస్తే జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి అనిత అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ, వంతెనలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టకపోవడమే విపత్తులకు కారణం అని మంత్రి అనిత అన్నారు. ప్రమాదాలు సంభవించినపుడు గోల్డెన్ అవర్ లో వీలైనన్ని ప్రాణాలు కాపాడాలని ఆపద మిత్రులకు శిక్షణనిచ్చి సీపీఆర్ సహా మెళకువలు నేర్పడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రాణాలు కాపాడడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలకు ఆర్థిక సాయం పెంపుపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్, కార్మిక శాఖ అడిషనల్ సెక్రటరీ గంధం చంద్రుడు, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ) పి.సంపత్, అగ్నిమాపక సంస్థ ఆర్ఎఫ్ఓ జిలాని, ఏపీఎస్డీఆర్ఎఫ్ ఐజీ రాజకుమారి, ఎన్టీఆర్ కమిషనరేట్ డీసీపీ కేజీవి సరిత, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ ఈడీ నాగరాజు తదితరులు

Also Read: Medak District News: బుడ్డోడా ఎంత పని చేశావురా.. పోలీసులకే చుక్కలు చూపించాడు!

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!