Venu swamy : వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన చెప్పిన జ్యోతిష్యం చాలా వరకు నిజమైంది. కాంట్రవర్సీ జ్యోతిష్యంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు స్వామి మాటలే స్టార్ నటీ నటులు కొంపలు ముంచాయా? స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవర కొండ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మీద మైండ్ బ్లాక్ అయ్యే విధంగా జాతకం చెప్పారు.
ప్రభాస్ కు అనారోగ్య సమస్యలు వస్తాయని, విజయ్, సమంత డిప్రెషన్ కు గురవుతారని ఇలా ఎందరి మీదో జ్యోతిష్యం చెప్పారు. చైతు, సమంతలు విడిపోతారని వేణుస్వామి ముందే చెప్పారు. ఇది నిజమవ్వడంతో ఈయనకి ఫేమ్ పెరిగింది. అయితే డిసెంబర్ లో చైతు, శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరూ ఇష్ట పడి పెళ్లి చేసుకున్నా .. మళ్లీ విడాకులు తీసుకుని విడిపోతారంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇది, అప్పట్లో పెద్ద రచ్చ అయింది.
Also Read: Niloufer hospital: బెడ్లు వెయ్యి.. బిల్లులు పదిహేను వందలకు? ఆ హాస్పిటల్‌లో సానిటేషన్ గోల్‌మాల్!
ఇక ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోర్టు సమస్యల్లో ఇరుక్కుంటాడని ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టే పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ప్రపంచం వ్యాప్తంగా వివాదాస్పదమైంది. అంతే కాదు, బన్నీ ఒక రాత్రంతా జైలులో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికీ, ఈ ఘటనకి సంబందించి అల్లు అర్జున్ కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.
Also Read: Trolls On Gold Price: బంగారాన్ని వదలని ట్రోలర్స్.. వీడియో తెగ వైరల్
అలాగే, రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు మీద కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటాడని, దీని నుంచి బయట పడటం చాలా కష్టమని వేణు స్వామి జాతకం చెప్పాడు. ఆయన ఆ రోజు చెప్పినదే.. నేడు నిజమైంది. మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 27 న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేశారు.
ఒకప్పుడు వేణు స్వామిని దారుణంగా ట్రోల్స్ చేశారు. కానీ, ఇప్పుడు ఆయన నోటి నుంచి ఏది వస్తే అదే నిజమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే, అతను జాతకం నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరేమో వారికీ అలాగా జరగాలని రాసి పెట్టి ఉంది కాబట్టి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.