Singer Pravasthi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Singer Pravasthi : ప్రవస్తి బ్యాక్ గ్రౌండ్ ఉన్నదెవరు? టార్గెట్ సునీత అందుకేనా?

Singer Pravasthi : ప్రముఖ ఛానెల్ లో  ప్రసారమయ్యే పాడుతా తీయగా షో గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, తాజాగా ఈ షో పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య  సంచలన ఆరోపణలు చేసింది. ఈ వివాదం పై జర్నలిస్ట్  దుర్గ మండిపడ్డారు. 

ఈ నేపథ్యంలోనే మీడియాతో  జర్నలిస్ట్ దుర్గ మాట్లాడుతూ ”  ఒక చిన్న పిల్ల అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే వినడానికి బాగలేదు. ఎందుకంటే అమ్మాయి గొప్ప సింగర్ అయింది కూడా ప్రోగ్రామ్ వలనే అని అన్నారు. పాడుతా తీయగాలో చేసింది, తమిళంలో కూడా చేసింది. ఇంకా చాలా సింగింగ్ ప్రోగ్రామ్స్ లో అవార్డ్స్ కూడా వచ్చాయని చెప్పింది. నన్ను ఎలిమినేట్ చేస్తే నేను కృంగిపోతాను, నన్ను మెచ్చుకుని నాకు అవకాశం వస్తే నేను పొంగిపోతాను అంటే కుదరదు కదా అని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతాయి. ముఖ్యంగా, ఇలాంటి కాంపిటేషన్ ప్రోగ్రామ్స్ లో చాలా చాలా జరుగుతుంటాయని అన్నారు. 

Also Read: MP Konda Vishweshwar Reddy: అసద్ కు కేసీఆర్ బూతుల రోగం అంటుకుందా?.. చేవెళ్ల ఎంపీ సంచనల కామెంట్స్!

ఆమె ఇంకా మాట్లాడుతూ ” ఏదైనా మనకి మనం బాగా చేశామని అనుకుంటాము. నేను బాగా చేయలేదని ఎవరూ కూడా ఒప్పుకోరు. కాకపోతే జడ్జెస్ అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి జడ్జ్మెంట్ చాలా కష్టమవుతోందని అన్నారు. రోజు అమ్మాయి ఇండస్ట్రీని వదిలేయదలచుకున్నాను, అందుకే కీరవాణిని అన్నాను , సునీత అంటాను, చంద్రబోస్ ను అంటాను అంటే అది వినడానికి కూడా బాగలేదు. ఎందుకంటే, వాళ్లు ఒక్క షో తోనే జడ్జ్మెంట్ చేయడం లేదుగా.. వాళ్ళు గతంలో చాలా చేశారు. బాల సుబ్రహ్మణ్యంతో చేశాను, ఆయన చాలా మెచ్చుకునే వారు, వీళ్ళు మెచ్చుకోవడం లేదు అనేది ఎంత వరకు కరెక్ట్ ” అని వ్యాఖ్యలు చేసింది. 

Also Read : MP Chamala Kiran: కేసీఆర్ పిట్టల దొర, కేటీఆర్ తుపాకీ రాముడు.. ఎంపి చామల సంచల కామెంట్స్

” బాగుంటే మెచ్చుకుంటారు, బాగలేకపోతే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళను ఏం అనరు. ఇప్పుడు, అమ్మాయి అన్ని ఆలోచించే స్టేజ్ లో ఉందిగా .. ఇలాంటివి మాట్లాడొచ్చా? అని ప్రశ్నించింది. సునీత ఫేస్ అలా పెట్టేస్తుంది, నన్ను ఫస్ట్ నుంచి పురుగులా చూశారని అమ్మాయి అంటుంది. కానీ, నేను అలా అనుకోవడం లేదు.. నేను స్టార్టింగ్ నుంచి షో చూస్తున్నాను, ఇప్పటి వరకు ఎలాంటి వివక్షలు రాలేదని అన్నారు. రోజు నా మీద దాడి జరగొచ్చు, నా కుటుంబం మీద దాడి జరగొచ్చు, లేదంటే మేము ఏమైనా చేసుకుంటే కారకులు కీరవాణి, చంద్రబోస్, సునీత అని అమ్మాయి నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని ” జర్నలిస్ట్ దుర్గ అన్నారు. 

అయితే, దీని వెనుక ఎవరున్నారో తెలియాల్సి ఉంది. అలాగే, సింగర్ సునీతనే ఎందుకు టార్గెట్ చేసిందంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..