MP Chamala Kiran (imagecredit:twitter)
Politics

MP Chamala Kiran: కేసీఆర్ పిట్టల దొర, కేటీఆర్ తుపాకీ రాముడు.. ఎంపి చామల సంచల కామెంట్స్

హైదరాబాద్: MP Chamala Kiran: బీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారముందని ఆయన అన్నారు. అయితే ఈ పదవి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇవ్వడాన్ని తను స్వాగతిస్తున్నాను అని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ, నెల్సన్ మండేలా లాగా కేసీఆర్ ఫీల్ అవుతున్నారు అని ఆయన అన్నారు. గాంధీ భవన్ లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఇ విధంగా మాట్లాడారు.

అంతా కులగణన ఫలితమే:

కాంగ్రెస్ కులగణన ఫలితమే బీఆర్ఎస్ పార్టీ బీసీని అధ్యక్షుడిగా నియమిస్తోందని, కేసీఆర్ చేసిన తప్పులకు రజతోత్సవ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు. కేసీఆర్ పిట్టల దొర, కేటీఆర్ తుపాకీ రాముడు ప్రజల నుండి దోచుకున్న డబ్బులతో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీకా, టీఆర్ఎస్ పార్టీకా? రజతోత్సవ బ్యానర్ లో బీఆర్ఎస్ అని ఉంటుందా? టీఆర్ఎస్ అని ఉంటుందా కేటీఆర్ మళ్ళీ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలను స్మరించుకున్నారు అని ఎద్దేవ వేశారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఏముంది? కేసీఆర్ కి లేవడమే చేత కావడం లేదు. ముఖ్యమంత్రి అయ్యి చేసేదేముంది? తుపాకీ రాముడి బాధ ఏంటో అర్థం కావడం లేదు భారీ డైలాగులు కొట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు కళ్ళముందు జరిగిన చరిత్రను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు అని ఎంపి చామల అన్నారు.

తుపాకీ రాముడు అలియాస్ కేటీఆర్ కి సూటీ ప్రశ్న రజతోత్సవ సన్నాహక సభ టిఆర్ఎస్ కి చేస్తున్నారా?బిఆర్ఎస్ కి చేస్తున్నారా? దేశాన్ని దోచుకుందామని టిఆర్ఎస్ బిఆర్ ఎస్ గా మార్చింది నిజం కాదా? పార్టీ నుంచి తెలంగాణ పదం తొలగించిన మీకు రజతోత్సవ సభ ఎలా నిర్వహిస్తారు? తెలంగాణను దోచుకున్నందుకు కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పు టిఆర్ఎస్ పార్టీ బతికే ఉందా కేటీఆర్ అని ఆయన విమర్షించారు. హైటెక్స్ సిటీ కట్టిన చంద్రబాబు ఆరోగ్య శ్రీతో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అంటూ కేటీఆర్ గుర్తు చేస్తున్నారు, ఏం ఉద్దరించారని కేసిఆర్ ను ప్రజలు గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ అధికారంలోకి రావాలి పిట్టల దొర కేసిఆర్ రిటైర్ అయిపోయి ఫాం హౌస్ కి పరిమిత మయ్యిండు అని అన్నారు. 8 లక్షల కోట్లు దోచుకుంది సరిపోలేదా తుపాకీ రాముడు మళ్ళీ దోచుకుందామని ప్లాన్ తో అధికారంలోకి రావాలని తుపాకీ రాముడి ఆలోచన సిగ్గు శరం లేకుండా తుపాకీ రాముడు మళ్ళీ అధికారం కలలు కంటున్నాడు అని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు:

నీళ్లు,నిధులు,నియామకాలు పేరుతో తెలంగాణ ప్రజల్ని పిట్టల దొర అలియాస్ కేసిఆర్ ప్రజలను వంచించాడు అని లిక్కర్ కవిత, హ్యాపి రావ్, పిట్టల దొర, అగ్గి పెట్ట హరీష్ రావు తప్ప బిఆర్ఎస్ లో ఎవరున్నారు అని అన్నారు. దొంగల్లా దోచుకున్న సొమ్ముతో రజతోత్సవ సభలు పార్టీలో టీఆర్ఎస్ లేనిది రజతోత్సవ సభలు ఎందుకు బిఆర్ఎస్ నేతలు పంచే పైసలను తీసుకోండి ఆ సొమ్ము తెలంగాణ ప్రజల నుంచి దోచుకుందే అని అన్నారు. కాపలా కుక్క లాంటి కళ్ల బొల్లి మాటలు చెప్పిన కేసిఆర్ లేవడానికి చేతకాని పిట్టల దొర మళ్ళీ అధికారంలోకి రావాలని తుపాకీ రాముడు అనడం హాస్యాస్పదం అని ఎద్దేవ వేశారు. వాస్తవ చరిత్ర చూశాక బుద్ద్ది ఉన్నవాళ్లు ఎవరైనా బిఆర్ ఎస్ పాలనను కోరుకుంటారా కాంగ్రెస్ పాలన గురుంచి మాట్లాడటానికి తుపాకీ రాముడికి, బిఆర్ ఎస్ నేతలకు అర్హత లేదు అని అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ, అభివ్రుద్ధి చూశాక విమర్శలు చేయడానికి తుపాకీ రాముడుకి సిగ్గుండాలి అని అన్నారు.

Also Read: ALiquor Shops Closed: మందుబాబులకు బిగ్ షాక్.. ఏకంగా 4 రోజులు మద్యం బంద్..

దేశం ఆశ్చర్యపోయేలా సన్న బియ్యం పంపిణీ, కేజీ టు పిజి విద్య, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యా సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. పదేళ్లలో ఉద్యోగాలు ఎటుపోయాయి ఒక్క ఇంచు మెట్రో పనులు జరిగాయా? లక్షన్నర కోట్లలోనే మూసి ప్రక్షాళన, ఫోర్త్ సిటి బిఆర్ఎస్ హయంలో లక్షన్నర కోట్లు పెట్టిన కాళేశ్వరం కుప్ప కూలిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలో ప్రవేశ పెట్టిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ ఎందుకు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి పే భయంతో ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీ పుణ్యాన రబ్బరు చెప్పుల హరీష్ రావు మంత్రి అయ్యాడని అన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కేసిఆర్ టీడీపీ నుంచి బయటికి వచ్చిన విషయం నిజం కాదా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు ప్రభుత్వం తీసుకొస్తుంటే ఓర్వలేరా? నోరు ఉంది కదాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు తుపాకీ రాముడు అని అన్నారు.

పదేళ్లలో ఎన్ని సార్లు డిఎస్సీ వేశారో చెప్పు దమ్ముందా తుపాకీ రాముడు 21 వేల కోట్ల రుణ మాఫీ జరిగిందని లెక్కలు చెపుతుంటే అవాస్తవాలు ప్రచారం చేయడానికి కేటీఆర్ కి బుద్ధి ఉందా బడెక్ట్ లో 3 లక్షల కోట్లు ఉంటే 70 వేల కోట్లు రైతులకు కాంగ్రెస్ సర్కార్ కేటాయిస్తుంది. మాది రైతుల సంక్షేమం ప్రభుత్వం రాహుల్ గాంధీకి సమాజం మీద సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి అందరికీ సమన్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి అని అన్నారు. హైదరాబాద్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఫోర్త్ సిటి లాంటివి కడితే ఏం నష్టం ప్రజలు ప్రతిపక్షాల విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల సర్వేతో బిఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు