PM Modi (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

PM Modi: ఏపీకి ప్రధాని మోడీ.. భారీ రోడ్ షో.. రూట్ మ్యాప్ రెడీ..

PM Modi: మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్వర్యంలో మంత్రుల బృందం ప్రధాని పర్యటన సంధర్భంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న కోణంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి కార్యక్రమాల పర్యవేక్షణ నోడల్ అధికారి వీరపాండ్యన్ ఏపీలో ప్రధాని పర్యటన వివరాలను వివరించారు.

ప్రధాని పర్యటన వివరాలు ఇవే..
ప్రధానమంత్రి కార్యక్రమాల పర్యవేక్షణ నోడల్ అధికారి వీరపాండ్యన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రధాని పర్యటన ఏర్పాట్లను వివరిస్తూ టెంటటివివ్ కార్యక్రమం ప్రకారం మే 2వ తేది మధ్యాహ్నం 3గం.లకు ప్రధాన మంత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని వివరించారు. తదుపరి హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్ద గల హెలీఫ్యాడ్ కు 3.20గం.లకు చేరుకుంటారని తెలిపారు.

అనంతరం అక్కడ నుండి ప్రధాన వేదిక వరకు సుమారు 1.2 కి.మీల పొడవునా రోడ్డు షో నిర్వహిస్తారని వివరించారు. రోడ్డుషోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అంతేగాక సాంస్కృతిక బృందాల ప్రదర్ళన ద్వారా స్వాగతం పలుకుతారని పేర్కోన్నారు. 3.35గం.లకు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరావతి ఫెవిలియన్ కు చేరుకుంటారని తదుపరి 3.45గం.లకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని వివరించారు.

సాయంత్రం 5గం.ల ప్రాంతంలో ప్రధాని హెలీఫ్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విమానంలో బయలుదేరి వెళతారని అన్నారు. మొత్తం మీద సుమారు రెండు గంటల పాటు సాగే ప్రధాని పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

10 పార్కింగ్ స్థలాలు..
ప్రధాని పర్యటనకు సంబంధించి 10 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ తాగునీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వివిఐపిలకు కరకట్ట, సీడ్ యాక్సిస్ రోడ్లను ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక సామాన్య ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు వీలుగా విజయవాడ నుండి మరో రెండు రూట్లు,గుంటూరు నుండి నాలుగు రూట్లను, మరికొన్ని తాత్కాలిక రూట్లను కూడా ట్రాఫిక్ కు అంతరాయాలు లేని విధంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు.

ఆయా రోడ్లన్నీ పాట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తీర్చి దిద్దాలని ఆర్ అండ్బి అధికారులకు సూచించారు. ఆయా రోడ్లపై గల వివిధ బాటిల్ నెక్స్ ను సరి చేయాలని చెప్పారు. వివిధ జిల్లాల నుండి సభకు తీసుకువచ్చే వారందరికీ అల్పాహారం,తాగునీరు, మజ్జిగ,పండ్లు,భోజనం వంటివి పంపిణీ చేయాలని సంబంధిత ఇన్చార్జులకు సూచించారు. ఈవిషయంలో రాజీ పడవద్దని ఎక్కడా ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.

ఈనెల 29 సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆయా అధికారులకు చెప్పారు. 30వ తేదీన రిహార్సల్ ఉంటుందని, తదుపరి ఎస్పిజి రిహార్సల్స్ ఉంటాయని తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి ఆయా అధికారులకు కేటాయించిన పనులను వారి బృందాలతో సక్రమంగా జరిగేలా చూసుకోవాలని ప్రతి రోజు పర్యటించి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పారు. అంతేగాక ఏర్పాట్లకు సంబంధించి ప్రతి రోజు సా.4గం.లకు డైలీ నివేదికను సమర్పించాలని వీరపాండ్యన్ చెప్పారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ టెంటటివ్ కార్యక్రమం ప్రకారం మే 2వ తేది మధ్యాహ్నం 3గం.లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని అక్కడ నుండి హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం సమీపంలోని హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడ నుండి రోడ్డు షో ద్వారా సచివాలయం వెనుక వైపున గల ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు.

Also Read: AP Govt: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. పని చేసిన వారంలోగా డబ్బుల చెల్లింపు..

ఈకార్యక్రమానికి సంబంధించి విధులు కేటాయించిన అధికారులు వారి టీంలతో కలిసి ఆయా పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాలని చెప్పారు. ఈకార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఇతర ఏవిధమైన సమస్యలున్నా నోడలు అధికారి వీరపాండ్యన్ తో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించుకోవాలని చెప్పారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు