AP Govt (image credit:Twitter)
పశ్చిమ గోదావరి

AP Govt: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. పని చేసిన వారంలోగా డబ్బుల చెల్లింపు..

AP Govt: ఏలూరు జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఇసుక స్టాక్ పాయింట్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యే లు తో కలిసి జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఉచిత సరఫరా, వేసవిలో త్రాగునీటి సరఫరా, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

త్రాగునీటి సమస్య పరిష్కరించాలి
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో నిర్మాణ పనులకు అనుకూలం కావున జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణం, సిసి రోడ్లు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పలు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు నియోజకవర్గాలలో ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రస్తుత వేసవి , రానున్న వర్షాకాలంలో ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ స్టాక్ పాయింట్ లో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు ఏర్పాటుచేయడం, మరమ్మత్తులకు గురైన బోర్లకు మరమ్మత్తులు చేయించాలన్నారు.

వారంలో కూలీ డబ్బులు..
త్రాగునీటి సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలన్నారు. త్రాగునీటి చెరువులు పూర్తి స్థాయిలో నింపుకునేందుకు గాను కాలువలను కట్టే సమయాన్ని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించామన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో కోటి 20 లక్షల పనిదినాలు లక్ష్యానికి గాను, ఇంతవరకు కోటి 60 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. ఉపాధి హామీ పధకంలో కూలీలకు వేతనాలను వారంలోగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి సమయంలో త్రాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా కృషిచేసి, సగటు తలసరి ఆదాయం లో జిల్లాను రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ జిల్లాలో పేదల గృహ నిర్మాణాలు, వ్యక్తిగత గృహ నిర్మాణాల పునాదులు పూడిక అవసరాలకు మట్టిని తీసుకునేందుకు అనుమతించాలన్నారు. వాణిజ్య అవసరాలకు తీసుకునే మట్టి తవ్వకాలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలు, ప్రభుత్వ నిర్మాణ పనులకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రావెల్ వంటి క్వారీల నిర్వహణ పొంది ఇంకా తవ్వకం పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల కు నోటీసులు అందించి, లీజ్ లైసెన్స్ లు రద్దు చేసి, నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని గనులు శాఖ అధికారులకు మంత్రి సూచించారు. గ్రామాలలో పశువులకు కమ్యూనిటీ పశు షెడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి పధకంలో మామిడి రైతులకు మేలు చేకూర్చే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎన్ఎస్ పి కెనాల్ లో ఆక్రమణలు, పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పోలవరం కుడిప్రధాన కాలువ ద్వారా నుండి మీర్జాపురం, సగ్గూరు, కొమ్మూరు రిజర్వాయర్లకు ఎత్తిపోతల పధకం ద్వారా సాగునీరు అందించాలన్నారు. ఉపాధి హామీ పధకంలో మంజూరైన మైనర్ ఇరిగేషన్ చెరువుల పనులను త్వరితగతిన చేపట్టి, కూలీలకు మరిన్ని పనిదినాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: Gold Rates: ఓరి నాయనో.. బంగారం రేటు సరికొత్త రికార్డ్.. ఇక కొనలేం..

సంక్షేమంతో పాటు అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం వాస్తవ రూపం తీసుకువస్తుందని, ఇప్పటికే అనేక పారిశ్రామిక సంస్థలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు. దినపత్రికలలో పలు శాఖలపై ప్రచురించబడే ప్రతికూల వార్తాంశాల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా సంబంధిత వార్తాంశాలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి వివరణలను పంపాలన్నారు.

No related posts found.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ