Rambha: రంభ ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియదేమో కానీ, 90స్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపింది. స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత మళ్లీ సినిమాలలో యాక్ట్ చేయలేదు. ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన రంభ, ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. రీసెంట్‌గా మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ సినిమా కూడా ఉన్నట్లుగా టాక్. అయితే దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ యాక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అనే ప్రశ్న తాజాగా ఆమెకు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. దీనికి ఆమె నటన నా రక్తంలోనే ఉంది అనేలా సమాధానమిచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా రీ ఎంట్రీకి గల కారణాలను కూడా రంభ చెప్పుకొచ్చింది.
Also Read- Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
‘‘పెళ్లి అనంతరం సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి తర్వాత అంతా కెనడా వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాం. నా పిల్లలకు వారి పనులు వారు చేసుకునే వరకు నేను బాధ్యతగా ఉండాలని అనుకున్నాను. అందుకే నటనకు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం వారు ఎవరిపైనా ఆధారపడకుండా, ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. తల్లిగా నా బాధ్యతను సక్రమంగానే నిర్వహించానని అనుకుంటున్నాను. వారిని చక్కగా పెంచాననే అనుకుంటున్నాను. వాళ్ల కోసం ఇన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. కానీ, నాకు నటనపై ఆసక్తి చచ్చిపోలేదు. నా ఆసక్తి నా భర్తకు కూడా తెలుసు. ఆయన ఓకే చెబితేనే నేను జడ్జ్‌గా ఓ షోకు పనిచేశాను. జడ్జ్‌గా చేయమని నన్ను అడిగినప్పుడు నా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఇచ్చి పంపించారు.
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లుగా ఆ షోలో ఎంటరైనప్పుడు అనిపించింది. ఆ కార్యక్రమంలో డ్యాన్స్ చేయడానికి కూడా చాలా భయపడ్డాను. ఆ భయంతోనే వ్యాన్‌లో నుంచి కూడా బయటికి రాలేకపోయాను. కానీ స్టేజ్ మీదకు వచ్చి, డ్యాన్స్ చేయడం మొదలెట్టిన తర్వాత నాలో భయం మొత్తం పోయింది. నేను నటిగా ఉన్నప్పటి మ్యాజిక్ మరోసారి క్రియేట్ అయినట్లుగా అనిపించింది. 15 సంవత్సరాలుగా నేను నటనకు దూరంగా ఉన్నప్పటికీ, నటనను మాత్రం మరిచిపోలేదు. అది నా బ్లడ్‌లోనే ఉంది.
Also Read- Samantha: విడాకులకు కారణం అదేనా? చైతూ చేసిన తప్పు ఇదేనా?
ఈ మధ్య నాతో పాటు నటించిన నటీమణులెందరో రీ ఎంట్రీ ఇచ్చి యాక్ట్ చేస్తున్నారు. ఇంట్లో అనుమతి కూడా లభించింది. అందుకే మరోసారి నటిగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రజలు నన్ను గుర్తు పెట్టుకున్నారా? లేదా? అనేది కూడా తెలుసుకున్నాను. ఇటీవల ఓ ప్రారంభోత్సవానికి వెళితే.. అక్కడ నన్ను ఎంతగానే ఆదరించారు. ఆ ఆదరణ చూసిన తర్వాత.. నాకు ఇంకా ధైర్యం వచ్చింది. రీ ఎంట్రీలో మంచి పాత్రలు ఎన్నుకుని, నటిగా మరోసారి నేనేంటో చూపించాలని అనుకుంటున్నాను’’ అని రంభ ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు