Pawan Kalyan
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ పరంగా బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన చేయాల్సిన సినిమాలు కన్ఫ్యూజన్‌లో పడ్డాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు. ఇందులో ఒకటి చివరి దశలో ఉంది. రెండోది సగానికి పైగా పూర్తయింది. మూడో సినిమా ఒక షెడ్యూల్ షూట్‌ని మాత్రమే జరుపుకుంది. ఇప్పుడీ మూడు సినిమాల నిర్మాతలు ఆ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణే. ఆయన షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. అతి త్వరలోనే రెండు సినిమాలు విడుదలకు నోచుకుంటాయి. కానీ, ఆయన ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమా షూటింగ్‌ల నిమిత్తం ఓ స్పష్టమైన ప్రకటన వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రకటనతో ఆయన చేస్తున్న రెండు సినిమాల నిర్మాతలు హ్యాపీగా ఉన్నారనేది తాజా సమాచారం. విషయంలోకి వస్తే..

Also Read- Samantha: విడాకులకు కారణం అదేనా? చైతూ చేసిన తప్పు ఇదేనా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా దాదాపు చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఒక వారం నుంచి 10 రోజులు పవన్ కళ్యాణ్ టైమ్ ఇస్తే.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆయన డేట్స్ ఇస్తాడని నమ్మి నిర్మాత ఏఎమ్ రత్నం ఇప్పటికి రెండు మూడు సార్లు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. కానీ, పవన్ కళ్యాణ్ అనుకోకుండా బిజీ కావడంతో షూటింగ్ ముందుకు కదలలేదు. దీంతో మరోసారి ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా చిత్రవర్గాల నుంచి తెలుస్తుంది. మరోవైపు సుజీత్‌తో చేస్తున్న ‘ఓజీ’ సినిమా (OG Movie) విషయంలో కూడా సరైన క్లారిటీ లేదు. ఓజీ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించి ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ చేయడానికి సుజీత్ కూడా రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసమే ఆయన వేరే సినిమా కూడా ఏదీ ఓకే చేయకుండా, ఆయన ఎప్పుడంటే అప్పుడు షూట్ చేయడానికి కాచుకుని కూర్చున్నారు. ఇక మూడో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు సంబంధించి వార్తలు కూడా ఆగిపోయాయి. ఇది సెట్స్‌పైకి వెళుతుందా? లేదా? అనేది క్లారిటీగా చెప్పలేం.

Also Read- Pravasthi Aaradhya: సింగర్ సునీత పై సంచలన ఆరోపణలు చేసిన ప్రవస్తి ఆరాధ్య

ఎందుకంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ఇంకా ప్రథమ స్థాయిలోనే ఉంది. కాబట్టి, ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తాడా? లేదా? అనేది కూడా డౌటే. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాల షూటింగ్‌‌ను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. ఆ చిత్రాల విడుదల తేదీని కూడా ప్రకటించుకోమని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు చెప్పినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తుంది. ముందుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి, ఆ తర్వాత ‘ఓజీ’ సెట్స్‌లోకి ఆయన అడుగు పెడతారని అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పండగ అనే చెప్పుకోవచ్చు. ‘హరి హర వీరమల్లు’ మే రెండో వారం లేదంటే మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉంటుందా? ఉండదా? అనేది క్లారిటీ వస్తుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగా ఇంకాస్త బిజీగా మారితే మాత్రం.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. కాకపోతే నిర్మాతల కోసం ఆ సినిమా చేసినా చేయవచ్చు. ఎందుకంటే, ఆయన కమిట్‌మెంట్ అలా ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!