Waragal Gurukulam (image credit: TWITTER)
నార్త్ తెలంగాణ

Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?

Waragal Gurukulam: తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి చేపట్టిన సీట్ల భర్తీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు.

గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం పాత జిల్లాను యూనిట్ గా గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకుని ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఇప్పుడు అధికారులు రాష్ట్ర యూనిట్ గా తీసుకుని సీట్ల భర్తీ చేయడంతో ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. సీట్ల భర్తీలో నెలకొన్న గందరగోళ పరిస్థితి స్వేచ్ఛ ప్రత్యేక కథనం….

విద్యార్థులకు శాపంగా అధికారుల నిర్ణయాలు

గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం పాత జిల్లాను యూనిట్ గా తీసుకుని ఆధ్వర్యంలో 2025- 26 విద్యా సంవత్సరానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 23 – 02- 2025 రోజున ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో మొత్తం గురుకులాల్లో 51000 సీట్లు ఉండగా 83000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ నెల 15 న ఫలితాలు విడుదల అయిన తరువాత అధికారులు సీట్ల భర్తీ ప్రక్రియ చెప్పారు. జిల్లా యూనిట్ గా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించిన అధికారులు ఇప్పుడు రాష్ట్ర యూనిట్ గా సీట్ల భర్తీ చేపట్టారు.

ఫస్ట్ ఫేస్ లోని మొదట లిస్ట్ పాత జిల్లా యూనిట్ గా సీట్ల భర్తీ చేసినప్పటికీ రెండో లిస్ట్ మాత్రం రాష్ట్ర యూనిట్ గా ఎంపిక చేసి లిస్ట్ గురుకులాలకు పంపించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గురుకుల పాఠశాలలో సీటు వస్తుందని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇతర జిల్లాలో సీటు రావడంతో అవాక్కు అయ్యారు. ఇతర జిల్లాలో సీటు రావడంతో ఏం చేయాలో తెలియక అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: CM Revanth reddy Japan Tour: ఉపాధి కల్పన లక్ష్యమే.. సీఎం రేవంత్ జపాన్ టూర్!

సీటు వచ్చిన వారు వదిలేసే ప్రమాదం

రాష్ట్ర యూనిట్ గా సీట్ల భర్తీ చేయడంతో ఇతర జిల్లాలో దూరంగా సీటు రావడంతో జాయిన్ కాకుండా పలువురు అభ్యర్థులు తమ సీట్లను వదులుకునే  ఆలోచనలో ఉన్నారు. మరో పక్క జిల్లా యూనిట్ గా మంచి ర్యాంక్ ఉన్న సీటు రాక అనేక మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల సీటు వచ్చిన వారు ఆ సీటు తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా జిల్లా యూనిట్ గా మంచి ర్యాంక్ ఉంది సీటు రాక మరి కొందరు ఇబ్బంది పడుతున్నారు.

తగ్గిన అభ్యర్థుల దరఖాస్తులు

స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక, కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువు కొనలేక తల్లిదండ్రులు గురుకుల విద్యాలయాల్లో మెరుగైన విద్య అందుతుందని ఆశాభావంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ప్రతి విద్యా సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఈ విద్య సంవత్సరం సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పరీక్ష రాసి విద్యార్థి ఎంపికైన తర్వాత కులం, ఆదాయం ఇతర ధృవీకరణ పత్రాలు పాఠశాలల్లో పరిశీలించేవారు.

ఇప్పుడు నోటిఫికేషన్ లో దరఖాస్తు సమయంలోనే తప్పకుండా నిబంధన పెట్టడంతో దరఖాస్తు తేదీ నాటికి సమయం లేక ధ్రువీకరణ పత్రాలు సమయానికి అందక అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేక పోయారు. దీంతో గత విద్యా సంవత్సరంలో లక్షకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ విద్యా సంవత్సరంలో కేవలం 83000 మంది అభ్యర్థులే దరఖాస్తులు చేసుకున్నారు.

ఖాళీ అయ్యే సీట్ల భర్తీలోను అశాస్త్రీయంగా వ్యవహరిస్తూ అర్హులైన విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి సీట్ల భర్తీ వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా సీట్ల భర్తీ చేపట్టాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ