Tollywood Heroine: హీరోయిన్ మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకుంది. సినీ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయినా కూడా వెనుకడుగు వేయలేదు. సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించి అందర్ని ఆకట్టుకుంది. స్టార్ డైరెక్టర్లతో ఈ బ్యూటీ వర్క్ చేసిన కూడా రెండో హీరోయిన్ గానే తీసుకున్నారు. మెల్లి మెల్లిగా వచ్చిన అవకాశాలను చేసుకుంటూ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే, తాజాగా మీనాక్షి చౌదరి వాళ్ళ అమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలను షేర్ చేసింది.
Also Read: Pravasthi Aaradhya: సింగర్ సునీత పై సంచలన ఆరోపణలు చేసిన ప్రవస్తి ఆరాధ్య
ఈ ముద్దుగుమ్మ 1 ఫిబ్రవరి 1997 లో హర్యానాలోని పంచకులలో జన్మించింది. ఈ బ్యూటీ ముద్దుగుమ్మ తండ్రి B.R చౌదరి భారత ఆర్మీలో కల్నల్ గా పని చేశారు. అయితే, 2018 లో ఆయన మరణించారు. చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో తన విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత, పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని కంప్లిట్ చేసింది.
Also Read: Plastic Waste: గ్రామాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు.. రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు!
2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఖిలాడీ, హిట్ కేస్ 2, గుంటూరు కారం మూవీస్ లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో పెద్ద హిట్ కొట్టింది.
సోషల్ మీడియాలో ఆమె తన అభిమానుల కోసం ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫోటో షూట్స్ పెడుతూ ఉంటుంది. అయితే, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూసిన నెటిజన్స్ చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు