UP Viral News (image credit:Canva)
Viral

UP Viral News: అల్లుడితో లవ్ లో పడ్డ అత్త.. 10 రోజులకే గర్భిణీ అంటూ..

UP Viral News: ప్రేమ ఎలా పుడుతుందో చెప్పడం కష్టతరంగా మారిన రోజులివి. అంతేకాదు ఏ వయస్సులో ప్రేమ పలకరిస్తుందో కూడా చెప్పలేం. అయితే కొందరు వయస్సు పైబడిన క్రమంలో ప్రేమ పాఠాలు వల్లె వేస్తున్న క్రమంలో పెద్ద చిక్కులు వస్తున్నాయి. అలాంటి ఘటనే ఇది. ఓ మహిళ ఏకంగా కాబోయే అల్లుడితో ప్రేమలో పడి, చివరకు గర్భం దాల్చింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్‌లో, తన సొంత అల్లుడి ప్రేమలో పడిన ఒక అత్త, అతని ప్రేమ కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అత్త సప్న, ఆమె కాబోయే అల్లుడు రాహుల్ ఇద్దరూ కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా ఇంటి నుండి పారిపోయారు. అప్పటి నుండి వారిద్దరి జాడ లేదు. వారి మొబైల్ ఫోన్లు కూడా నిరంతరం స్విచ్ ఆఫ్ చేయబడి ఉండటంతో, అలీఘర్ పోలీసులు వారి ఆచూకీని కనుగొనలేకపోయారు.

వారిద్దరూ ఒకటిన్నర వారాలకు పైగా కలిసి ఉన్నారు. నిరంతరం సిటీలు మారుస్తూ ఉన్నారు. పోలీసులు ఈరోజు కాకపోతే రేపు ఏదో విధంగా తమను చేరుకుంటారని వారు భావించారు. దీనితో రాహుల్ స్వయంగా యుపి పోలీసులను సంప్రదించి, ఎక్కడున్నామో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో వారిద్దరూ భారత్ – నేపాల్ సరిహద్దులో ఉండగా, సమాచారం అందుకున్న పోలీసుల బృందం వారిద్దరినీ నేపాల్ సరిహద్దు నుండి అలీఘర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

వెలుగులోకి కొత్త విషయం?
తన కాబోయే అల్లుడు రాహుల్‌ను ప్రేమిస్తున్న అత్త గర్భవతిగా ఉందా? ఇదే విషయంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె తన కాబోయే అల్లుడు రాహుల్ బిడ్డకు తల్లి కాబోతోందని ప్రచారం జరుగుతోంది. నిజానికి అత్తతో కలిసి రాహుల్ కలిసి పారిపోయారు. ఇద్దరూ చాలా రోజులు కలిసి ఉన్నారు. తరువాత వారిద్దరూ అలీఘర్‌కు వచ్చి పోలీసుల ముందు హాజరయ్యారు.

Also Read: Southern Railway Jobs: దక్షిణ రైల్వేలో జాబ్స్.. వెంటనే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి!

ప్రస్తుతం ఆమె గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ షాక్ కు గురవుతున్నారు. పోలీసులు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు కాబోయే అల్లుడితో లేచిపోవడం ఒక రకం వెరైటీ అయితే, లేచి పోవడమే కాక అత్త గర్భం దాల్చడం ఇదో వెరైటీ అంటున్నారు నెటిజన్స్. అలాగే ఈ కలియుగంలో ఇంకా ఏమేమి చూడాలో అంటూ తెగ వాపోతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!