KPHB Crime: భార్య భర్తల బంధం నానాటికి బలహీన పడుతోంది. భర్తను భార్య.. భార్యను భర్త హత్య చేస్తున్న ఉదంతాలు ఇటీవల బాగా ఎక్కువ అయ్యాయి. అక్రమ సంబంధం, ఆస్తి, కుటుంబ కలహాలు ఇలా పలు కారణాల చేత తమ జీవిత భాగస్వామిని అంతం చేస్తున్నారు. తాజాగా ఈ తరహా ఘటన హైదరాబాద్ లో జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అతి కిరాతకంగా హత్య చేసింది.
ఏం జరిగిందంటే?
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. భర్త సాయిలు ను భార్య కవిత అతి దారుణంగా కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసింది. ఆపై హత్యను కప్పిపుచ్చేందుకు అతడ్ని పూడ్చి పెట్టింది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ఇద్దరికీ ఇల్లీగల్ ఎఫైర్స్
నగరానికి చెందిన సాయిలు, కవిత ఇద్దరు భార్య భర్తలు. వారిద్దరు 15 ఏళ్లుగా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. అయితే కొంతకాలంగా వారిద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. ఇద్దరికీ వేర్వేరుగా వివాహేతర సంబంధాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్త సాయిలు తరుచూ కవితను వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది.
చెల్లెలి భర్తతో కలిసి
వేరుగా ఉంటున్నప్పటికీ భర్త తరుచూ వచ్చి వేధిస్తుండటంపై కవిత చాలా రోజులుగా కోపం ఉండేది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె.. చెల్లెలి భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. అతడి సాయంతో హత్యకు స్కెచ్ వేసింది. తొలుత భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన ఆమె.. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని పూడ్చిపెట్టింది.
Also Read: Srinivas on Chennamaneni Ramesh: బీఆర్ఎస్ నేతపై ప్రభుత్వ విప్ ఫైర్.. క్రిమినల్ కేసుకు డిమాండ్!
కేసు నమోదు
భర్త సాయిలు కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కవితను ప్రశ్నించగా పనికోసం ఊరికి వెళ్లి తిరిగి రాలేదని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో అనుమానించి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. భార్య కవిత జరిగినదంతా పోలీసులకు చెప్పింది.