Snake In Refrigerator ( Image Source: Twitter)
Viral

Snake In Refrigerator: ఫ్రిడ్జ్ లో బుస్ బుస్ సౌండ్.. డోర్ తీయగానే దిమ్మతిరిగే షాక్

Snake In Refrigerator: ప్రస్తుతం, సోషల్ మీడియాను ( Social Media ) చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు విపరీతంగా వాడుతున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దలు వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి షేర్ చేసిన ఓ వీడియోను అందరూ భయపడుతున్నారు. ప్రస్తుతం, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూశాక .. వామ్మో, మీరు కూడా పక్కా షాక్ అవుతారు. ఇంతకీ, అతను షేర్ చేసిన వీడియోలో ఏముందో ఇక్కడ చూద్దాం.. వ్యక్తి షేర్ చేసిన వీడియోలో ఫ్రిడ్జ్ లో పాము దూరింది. మీరు వింటున్నది నిజమే.. మళ్లీ మీకు అనుమానం రావొచ్చు. ఇది నిజమైన పామునా లేక డమ్మీ నా అని. అలాంటి సందేహాలేం అవసరం లేదు. అది నిజమైన నాగు పామే.

Also Read: Pravasthi Aaradhya: సింగర్ సునీత పై సంచలన ఆరోపణలు చేసిన ప్రవస్తి ఆరాధ్య

హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి చూపిస్తాను అస్సలు భయపడకండి.. ఎండాకాలం కదా.. చూడండి ఫ్రెండ్స్.. మా ఫ్రిడ్జ్ లో ఎవరున్నారో? నాగు పాము ఇక్కడికొచ్చి భలే సెటిల్ అయింది .. ఇది ఏసీ అనుకుంటున్నట్టు ఉందంటూవీడియోను షేర్ చేశాడు. ఫ్రిడ్జ్ లో పాము ఉందనగానే వెంటనే స్నేక్ క్యాచర్స్ కు సమాచారాన్ని అందిస్తారు. వెంటనే వారొచ్చి పట్టుకుని అడవులలో వదిలేస్తారు. ఇతనేంటో ఏదో గొప్ప పని చేసినట్టు వీడియో తీసి మరి చూపిస్తున్నాడు.

దీని పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పాలు, గుడ్లు కూడా పెట్టు బ్రో తినేసి మంచిగా పడుకుంటాది, వీలు అయితే దానికి కాపలాగా ఉండు అని కొందరు అంటున్నారు. మరి కొందరు.. మంచిగా కూర్చోబెట్టి , సినిమా షూటింగ్ చేసినట్టు చేశావ్.. నీ తెలివికి నా జోహార్లు, డ్రామా బాగుంది సినిమాగా స్టోరీ కి ట్రై చెయ్ .. వర్కవుట్ అవుతుంది. పాము కోసమే ఫ్రిడ్జ్ కొన్నట్లు ఉంది. ఎందుకంటే పాము తప్ప ఫ్రిడ్జ్ లో ఏమి లేవు, లైక్స్ కోసం ఇలాంటి వాటితో సాహసాలు చేయడం అవసరమా బ్రో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!