Mahesh Babu: తెలుగు సినీ ఇండీస్ట్రీలో మహేష్ బాబు ( Mahesh Babu) క్రేజే వేరు. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయిన నటుల్లో ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu) కూడా ఒకరు. ఇప్పటి వరకు ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ చూశాడు. కానీ, ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. సినిమా హిట్ అయిందని పొంగిపోడు, ఫ్లాప్ అయిందని బాధ పడడు. మహేష్ బాబు తన ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తూనే ఉంటాడు. ” గుంటూరు కారం ” మూవీలో కుర్చీ మడతపెట్టి పాటలో డ్యాన్స్ ఇరగదీశాడు. ఆ ఒక్క సాంగ్ తో ఎక్కడికో వెళ్ళి పోయాడు. మనం ఇప్పటి వరకు చూడని ఒక మహేష్ బాబును ఆ మూవీలో చూశాము.
Also Read: Vardhannapet News: ధాన్యం కొనుగోలులో మోసపోకండి.. ప్రభుత్వ ఐకెపి కేంద్రాల్లోనే అమ్మాలని సూచన…
ప్రస్తుతం, తన సినీ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న SSMB29తో బిజీగా ఉన్న విషయం మనకి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ గా ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ తన ఫ్యాన్స్ కి త్వరలో కొత్త ట్రీట్ ఇవ్వబోతున్నాడు.
Also Read: Gaddar Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ.. నామినేషన్స్ వివరాలివే!
సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి మే 31. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు నటించిన ‘అతిథి’ మూవీని మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు . సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మూవీలో అమృతా రావు కథానాయికగా నటించింది.
ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ, ఇప్పుడు రీ రిలీజ్ కు డిమాండ్ పెరిగింది. మహేష్ బాబుకున్న క్రేజ్ తో ఈ సినిమాని రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే, ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మహేష్ అభిమానులుఅతన్ని వెండి తెరపై చూడాలనే ఉత్సాహంలో ఉన్నారు. మరి ‘అతిధి’ హిట్ అవుతుందో ? లేదో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు