Actor: ప్రస్తుతం ఫోన్ లేకుండా మానవుని జీవన గమనం సాగడం లేదు. అన్నం, నీళ్లు లేకపోయినా, కంపల్సరీగా ఫోన్ ఉండాలి. ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్లుగానే ఫీలవుతున్నారు. చిన్న, పెద్ద, ముసలి.. ఇలా ప్రతి ఒక్కరికీ ఫోన్ అలవాటుగా కాదు, అవసరంగా మారిపోయింది. ఈ ఫోన్ వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్ట్‌లు చెబుతున్నా, మానవుని ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తెలిసినా, ఫోన్‌ని వదలకుండా ఉండలేకపోతున్నారు. ఒక్క మనిషికి మాత్రమే కాదు, ఫోన్ వాడకం వల్ల ఎన్నో జీవరాశులకు నష్టం వాటిల్లుతుందని, సినిమాల్లో సైతం చూపిస్తున్నా, ఒక్కరూ మారడం లేదు. చాలా లైట్ తీసుకుంటున్నారు. ఎవరైనా ఈ విషయాలు చెబితే, వారిని పిచ్చివాళ్లని చూసినట్టు చూస్తున్నారు.
Also Read- Vijayashanti: ఆ శాడిజం ఆపండి.. రివ్యూయర్స్‌పై రాములమ్మ ఫైర్!
ఫోన్ వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే, టాలీవుడ్‌కి చెందిన మల్టీ టాలెంటెడ్ నటుడు ఇప్పటికీ చిన్న ఫోనే వాడుతున్నారు. 30 వేల రూపాయలు పెట్టి ఫోన్ కొనే స్థోమత ఉన్నా, ఇంకా 3 వేల రూపాయల ఫోనే వాడటానికి కారణం ఏమిటో కూడా ఆ నటుడు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ నటుడు ఎవరని అనుకుంటున్నారా? ఎల్బీ శ్రీరామ్. అప్పుడెప్పుడో ఫోన్ గురించి, దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఎల్బీ శ్రీరామ్ (Senior Actor LB Sriram) చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ..
‘‘3 వేల రూపాయలు ఈ ఫోన్ ఖరీదు. 30 వేల రూపాయలు పెట్టి కూడా నేను ఫోన్ కొనుక్కోగలను. కానీ భయం నాకు. అసలీ 3 వేల రూపాయలు ఫోన్ కూడా లేకుండా ల్యాండ్ లైన్ వాడదామని ట్రై చేశాను. మరీ అది అడవిలో పోయి తపస్సు చేసుకున్నట్లుగా.. జరగని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానని.. ఈ 3 వేల రూపాయల ఫోన్‌నే వాడుతున్నాను. దీని వల్ల కూడా నష్టం ఉంటుంది. కాకపోతే తక్కువ నష్టం ఉంటుంది. నేనూ ట్యాబ్ వాడతాను. షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. అవన్నీ వాడతాను. అవన్నీ జేబులో పెట్టుకుని తిరిగితే అస్తమానం వాటినే వాడతాం. ఎక్కడో ఒక చోట పెడితే లిమిటెడ్‌గా వాడతాం. ఎందుకంటే ఫేసుబుక్‌లో నా ఫ్రెండ్స్ పెట్టే పోస్ట్‌లకు లైక్స్ కొట్టాలని, రిప్లయ్ ఇవ్వాలని ఎంతో పులకింతగా ఉంటుంది.
Also Read- Janhvi Kapoor: మగవాళ్లకు పీరియడ్స్ వస్తే అణుయుద్ధాలే.. జాన్వీ షాకింగ్ కామెంట్స్!
అందుకే భయం నాకు. ఎందుకంటే, వారందరికీ సమాధానం ఇస్తూ కూర్చుంటే, నా క్రియేటివిటీ ఆగిపోతుంది. ఆ జబ్బులో పడిపోతాం. వాళ్లు పొగుడుతుంటే తియ్యగా ఉంటాయి. అవి చేస్తూ ఉంటే నేను క్రియేషన్ చేయలేను కదా. అందరిలానే నాకూ 24 గంటలే ఉన్నాయి.. 25 గంటలేం లేవు కదా. అందుకని వాటి జోలికి పోను. మరొకటి ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ వయసులో రకరకాల అనారోగ్యాలకు గురవుతాను. కొత్తగా ఆరోగ్యాన్ని తెచ్చుకోలేకపోయినా, అనారోగ్యాన్ని ఎందుకు తెచ్చుకోవడం. ఏదైనా వస్తే హాస్పిటల్ బిల్స్ కట్టగానికి నా వెనకాల కుప్పలు తెప్పలుగా ఆస్తులేం లేవు. అందుకే ఈ భయాలన్నింటితోటి నా జాగ్రత్తలో నేను ఉంటాను. మనకి తెలియని రోగాలు చాలా పొంచి ఉన్నాయి. నూటికి 99 శాతం జాగ్రత్తగా ఉన్నా, ఆ ఒక్క శాతం చాలు. మీరు చివరి నిమిషంలో వచ్చారు. ఏం చేయలేం అని చెప్పడానికి. అందుకే, నా భయం నాది’’ అని చెప్పుకొచ్చారు. అయితే వీడియో పాతదే కానీ, కంటెంట్ మాత్రం తరతరాలకి ఉపయోగపడేదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు