AP Student Died: ఇటీవలే ప్రపంచంలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వీటిలో కొన్ని షాకింగ్ లాగా ఉంటే, మరి కొన్ని విషాదకరమైనవి. వీటికి సంబందించిన ఎన్నో వీడియోలు న్యూస్ లు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇవి వైరల్ అవ్వడంతో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో యువతీయువకులు కన్న తల్లి తండ్రులను కూడా ఆలోచించకుండా ప్రాణాలను తీసుకుంటున్నారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఎవరో ఏదో అన్నారని, ప్రేమించిన వాళ్ళు ప్రేమను ఒప్పుకోలేదని, ప్రేయసి మాట్లాడటం లేదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, ఇలా చిన్న కారణాలకే ఆత్మ హత్య చేసుకోవడానికి సిద్ధ పడుతున్నారు.
Also Read: Indira Cooperative Dairy scheme: పారదర్శకంగా గేదెల కొనుగోలు.. స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం!
ఇప్పుడు, తాజాగా ఓ విద్యార్థి నాలుగు అంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భీమునిపట్నంలోని ( bheemunipatnam ) జోన్ సంగివలసలో చోటు చేసుకుంది.
భీమునిపట్నం జోన్ సంగివలస ఎన్ఆర్ఐ వైద్య కళాశాల ఎంబిబిఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండగా, అకస్మాత్తుగా ఎగ్జామ్స్ సెంటర్లో నుంచి బయటికి వచ్చి దూకేసాడు. ఇతను ఆలోచించి దుకాడో లేక ఏదో ఆలోచిస్తూ దుకాడో కానీ, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫోర్త్ ఫ్లోర్ కెళ్ళి మరి ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఎగ్జామ్స్ సెంటర్లో ఏం జరిగిందో కాలేజీ యాజమాన్యం ఇంకా బయటపెట్టలేదు. వెంటనే, భీమిలి పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు