Case on Aghori: అఘోరీ వ్యవహారం ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలను వీడేలా కనిపించడం లేదు. తొలినాళ్లలో ఆలయాల వద్ద హల్ చేసిన లేడీ అఘోరీ (Lady Aghori).. ఆ తర్వాత శ్రీవర్షిణీ (Sri Varshini) అనే యువతితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో మెుదటి భార్యనంటూ మరో యువతి తెరపైకి రావడం.. శ్రీవర్షిణీని అఘోరీ పెళ్లి చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఇక తాము రాష్ట్రంలో అడుగుపెట్టబోమంటూ అఘోరీ-శ్రీవర్షిణీ జంట ప్రకటించడంతో ఇక ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పడినట్లేనని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మరో వివాదంతో అఘోరీ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
అఘోరీపై కేసు నమోదు
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ వ్యవహారం మలుపు తీసుకుంది. ఇక అంతా సెట్ అయ్యిందని భావిస్తున్న తరుణంలో అఘోరీపై ఏపీలో మరో కేసు నమోదైంది. అంబేద్కర్ ను అఘోరీ అవమానించిందంటూ దళిత సంఘాలు.. మచిలీపట్నంలో ఫిర్యాదు చేశారు. ప్రజలను సైతం అఘోరీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పోలీసులకు తెలిపారు. ఆమెను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అయితే అంబేద్కర్ ను అవమానపరిచేలా అఘోరీ ఏం కామెంట్స్ చేసిందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
చనిపోతామని బెదిరింపు
అఘోరీ-శ్రీవర్షిణి పెళ్లిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేసిన అఘోరీ దంపతులు.. ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో అడుగుపెట్టమని, తమ జోలికి ఎవరు రావద్దని సూచించారు. తమ మధ్యకు ఎవరైనా రావాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ చావుకు ట్రోలర్స్, విమర్శకులు, తమపై కేసులు పెట్టినవారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే అఘోరీపై మరో కేసు నమోదు కావడం ఆసక్తిరేపుతోంది.
Also Read: BR Naidu on YCP: గోవులను అమ్ముకున్నారు.. వైసీపీనే అసలు దోషి.. టీటీడీ ఛైర్మన్
ఏ క్షణమైనా అరెస్ట్!
మరోవైపు తెలంగాణలోనూ అఘోరీపై రెండు కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేదార్ నాథ్ లో ఉంటున్న అఘోరీని ఏ క్షణమైన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అఘోరీ కోసం హైదరాబాద్ పోలీసులు.. కేదార్ నాథ్ వెళ్లే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే అఘోరీతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారణాసిలోని అకాడాల నుంచి ప్రకటన విడుదలైంది.