BR Naidu on YCP: తిరుమల గోశాల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గోశాలలోని 100 ఆవులు చనిపోయాంటూ వైసీపీ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. ఈ క్రమంలో వైసీపీ (YCP) నేతలు గోశాల ఎదుట ఆందోళన నిర్వహించడం మరింత రచ్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తిరుపతి (Tirupathi)లోని గోశాలను సందర్శించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Reddy).. సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష వైసీపీుై తీవ్ర ఆరోపణలు చేశారు.
‘కమీషన్లకు గోవులు అమ్మేశారు’
గత వైసీపీ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. గోవుల గడ్డిని సైతం ఆ పార్టీ నేతలు తినిశారని మండిపడ్డారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి దుర్మార్గుడన్న టీటీడీ ఛైర్మన్.. అతడు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవులతో ఆటడుకున్నారని విమర్శించారు.
‘రికార్డులు ఎత్తుకెళ్లారు’
గోశాల వివాదంపై కోర్టుకు వెళ్తామని వైసీపీ నేతలు బెదిరిస్తుండటంపై కూడా టీటీడీ ఛైర్మన్ స్పందించారు. వారి వార్నింగ్ లకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. గతంలో పింక్ డైమండ్ పైనా అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు. అటు గోశాలలో రికార్డులన్నీ హరినాథరెడ్డి ఎత్తుకుపోయినట్లు చెప్పారు. తన బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని అతడు ఇలా చేసినట్లు ఆరోపించారు.
గత ఐదేళ్లలో కనిపించలేదా?
మరోవైపు కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి గోవుల వివాదంపై శుక్రవారం స్పందించారు. దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపైనా మాట్లాడిన టీటీడీ ఛైర్మన్.. గత ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. టీటీడీ అంటేనే ఒంటికాలిపై లేచే సుబ్రమణ్యస్వామి నిజానిజాలు ఏంటో తెలుసుకోరా? అంటూ నిలదీశారు.
Also Read: Congress on Kavitha: ఒక్క ఫొటోలో ఇంత అర్థముందా.. ఏంటమ్మ కవిత ఇది!
నలుగురు సభ్యులతో కమిటీ
మరోవైపు గోశాల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో దీనిపై ఓ కమిటీ వేయనున్నట్లు బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అందులో నలుగురు అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గోశాలలో ఏం జరుగుతుంతో ఈ కమిటీనే తేలుస్తుందని చెప్పారు. వైసీపీ తను చేసిన తమపై రుద్దే ప్రయత్నం చేస్తోందని.. దోషులు ఎవరు తప్పించుకోలేరని టీటీడీ ఛైర్మన్ అన్నారు. ఈ విషయాన్ని కచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.