Suryapet Student Died: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో, కళాశాల విద్యార్థిని బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉగాది పండక్కి ఇంటికి వెళ్లి నిన్న సాయంత్రం తల్లితో కలిసి కాలేజ్‌కి వచ్చిన విద్యార్థిని తల్లితో పాటే హాస్టల్‌లో గడిపింది. అయితే తెల్లవారుజామున కాలేజ్ బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
Also read: Vikarabad district: ఛార్జింగ్ కోసం ఎగబడ్డ జనం.. మీ కష్టం పగోడికి కూడా రాకూడదు!
అప్పటి దాకా తోటి విద్యార్థులతోటే ఉన్న యువతి విగత జీవిగా మారడంతో కళాశాల ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలు మంచిర్యాల జిల్లా వాసి, బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. విచారణానంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.