Arjun Son Of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ కొడుకుగా, రాములమ్మ విజయశాంతి తల్లిగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో దూసుకెళుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ తన కుమారుడు ఈ సినిమా చూసి ఏం అన్నాడో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Retro Trailer: అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారు.. ట్రైలర్ అదిరింది
ఈ సక్సెస్ మీట్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా చూసిన ప్రేక్షకులు, మా నందమూరి అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఫీలింగ్‌ను వర్ణించలేను. చాలా అద్భుతంగా ఉంది. అమ్మ (విజయశాంతి)తో కలిసి ఈ సినిమా చేయడం ఎప్పటికీ మరిచిపోను. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ కీలకమైన పాత్ర వేశారు. ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి క్రాఫ్ట్ గురించి ఆడియన్స్ మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సునీల్ అశోక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అజినీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం. క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్.
ఈరోజు (శుక్రవారం) పొద్దున్నే మా అబ్బాయి ఈ సినిమా చూశాడు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఇలాంటి సీక్వెన్స్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని అన్నాడు. ఆ రియాక్షన్‌కి నేను షాక్‌కి గురయ్యాను. చాలా గర్వంగా ఉంది నాన్న అని వాడు అనగానే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. మదర్ అండ్ సన్ మధ్య ఉన్న ఎమోషన్‌కి ప్రేక్షకులు అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ ప్రదీప్‌కు ఈ సినిమా క్రెడిట్ మొత్తం వెళుతుంది. ఆయన ఈ కథని నా దగ్గరికి తీసుకు వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు.
Also Read- DSP Vizag Concert: ఎట్టకేలకు అనుమతి.. దేవిశ్రీ కన్సర్ట్‌కు లైన్ క్లియర్
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో మొదలుపెట్టాం. ఆ నమ్మకమే ఈరోజు నిజమైంది. సినిమా విడుదలైన అన్ని చోట్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. కళ్యాణ్ రామ్‌తో కలిసి ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీ. సినిమా ఇంత బాగా రావడానికి కూడా కారణం ఆయనే. ఇందులో తల్లీకొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇదని అన్నారు. ‘ఈ సినిమాకి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి’ అని అన్నారు చిత్ర దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. ‘చాలా కాలం తర్వాత థియేటర్స్ అన్ని మళ్లీ ఫుల్ అవుతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ కాల్స్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈవినింగ్ నుంచి అన్నిచోట్ల షోలు యాడ్ అవుతున్నాయని నిర్మాత సునీల్ బలుసు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు