Aghori Srivarshini: లేడీ అఘోరీ – శ్రీవర్షిణి పెళ్లి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఒక ఆడపిల్ల జీవితాన్ని అఘోరీ నాశనం చేసిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అఘోరీ మెుదటి భార్యనంటూ మరో యువతి బయటకొచ్చి.. అతడిపై న్యాయపోరాటం సైతం ప్రారంభించింది. ఇలా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అఘోరీ-శ్రీవర్షిణి తాజాగా సంచలన ప్రకటన చేశారు.
‘తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టం’
తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసిన అఘోరీ – శ్రీవర్షిణి దంపతులు.. అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. అఘోరీ మాట్లాడుతూ తమపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాము తెలుగు రాష్ట్రాలకు ఇకపై రామని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ కు తామిద్దరం వెళ్లిపోతున్నట్లు తెలిపారు. జీవితాంతం అక్కడే ఉండిపోతామని అన్నారు. తమ బతుకేదో తాము బతుకుతామని లేడీ అఘోరీ స్పష్టం చేశారు.
చాలా హ్యాపీగా ఉన్నా: వర్షిణీ
మరోవైపు తన జీవితాన్ని అఘోరీ నాశనం చేసిందన్న విమర్శలపై శ్రీవర్షిణీ స్పందించింది. తన జీవితాన్ని ఎవరు బలివ్వలేదని పేర్కొంది. అఘోరీ వద్ద తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. మీడియా సహా ప్రతీ ఒక్కరూ తమ గురించే ఎందుకు చర్చిస్తున్నారని వర్షిణీ ప్రశ్నించింది. తమకు నచ్చినట్లు జీవిస్తామని.. ఇకపై తమ జోలికి ఎవరు రావొద్దని శ్రీవర్షిణి హితవు పలికింది.
‘ఆత్మహత్య చేసుకుంటాం’
తమ ఇద్దరిని వీడదీయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని అఘోరీ – శ్రీవర్షిణి ముక్తకంఠంతో చెప్పారు. తమ జీవితాల్లోకి రావాలని ప్రయత్నిస్తే పెట్రోల్ ట్యాంక్ సిద్ధంగా ఉందని వెంటనే పోసుకొని అగ్నికి ఆహుతీ అవుతామని అన్నారు. కారుతో సహా దహనం అవుతామని హెచ్చరించారు. అప్పుడు కూడా ఇలాగే ట్రోల్ చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఎవరు ట్రోల్ చేస్తున్నారో, కేసులు పెడుతున్నారో, విమర్శలు చేస్తున్నారో వారే ఈ రెండు ప్రాణాలు పోవడానికి కారకులు అవుతారని అఘోరీ స్పష్టం చేశారు. ఎవరైనా తమను పట్టుకోవడానికి వస్తే తమ ప్రాణాలు వదలడానికి సిద్దమంటూ అఘోరీ జంట వార్నింగ్ ఇచ్చింది.
Also Read: Twist In MMTS Case: రేప్ కాదు రీల్స్ కోసమే.. ఎంఎంటీఎస్ ఘటనపై విస్తుపోయే వాస్తవాలు!
అఘోరీతో సంబంధం లేదు: అకాడ
మరోవైపు అఘోరీకి సంబంధించి వారణాసిలో ఉండే అఖాడా సంఘం సంచలన ప్రకటన చేసింది. అఘోరీకి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అతడు తమ సంప్రదాయాలను పాటించడం లేదని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు కూడా అతడు అఖాడాలో లేడని స్పష్టం చేసింది. అఘోరీ పేరుతో అతడు జనాన్ని మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతడికి అఘోరీ లక్షణాలు ఒక్కటికి కూడా లేదని అఖాడా సంఘం తేల్చి చెప్పింది.