Urvashi Rautela
ఎంటర్‌టైన్మెంట్

Urvashi Rautela: సౌత్‌లో నాకు గుడి కట్టాలి.. డౌటే లేదు ఇది అదే!

Urvashi Rautela: ఈ మధ్య కాలంలో నటి ఊర్వశి రౌతేలా పేరు ఎలా వైరల్ అవుతుందో ప్రత్యక్షంగా అంతా గమనిస్తూనే ఉన్నారు. ఐటమ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ, ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ తన గ్లామర్ ప్రదర్శనతో అవకాశాలు పట్టేస్తుంది. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ వంటి వారి చిత్రాలలో నటించిన ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌లో నాకు గుడి ఉంది. సౌత్‌లో కూడా నాకు గుడి కట్టాలని కోరుకుంటున్నానంటూ ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవడమే కాదు, నెటిజన్లకు కూడా పని కల్పిస్తున్నాయి.

Also Read- Lokesh Kanagaraj: యువ హీరో శ్రీరామ్ హెల్త్‌పై లోకేశ్‌ కనగరాజ్‌ పోస్ట్.. అసలు శ్రీరామ్ ఎవరు?

వాస్తవానికి నార్త్‌లో ఈ భామకు అంత గొప్పగా అవకాశాలేం రావడం లేదు. కేవలం గ్లామర్ ప్రదర్శనను మాత్రమే నమ్ముకున్న ఈ బ్యూటీని ఐటం సాంగ్స్‌కి తప్పితే, క్యారెక్టర్స్ ఇచ్చి నటిగా వాడుకోవడానికి డైరెక్టర్స్ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. తెలుగులో కూడా డైరెక్టర్ బాబీ తప్పితే అంతగా ఈ భామను ఎంకరేజ్ చేసే వాళ్లు కూడా లేరు. ఇక ఇటీవల బాలయ్య ‘డాకు మహారాజ్’లో చిన్న పాత్ర ఇస్తే.. దానిని చూపిస్తూ ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. అందులో ఆమె స్టెప్స్ వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయినా కూడా ఎక్కడికి వెళ్లినా అవే స్టెప్స్ వేస్తూ.. సౌత్‌లో నాకు తిరుగులేదు అనేలా ఇంటర్వ్యూలు ఇస్తుండటం విశేషం.

తాజాగా ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఆల్రెడీ ఉత్తరాఖండ్‌లో ఆలయం ఉంది. ఈసారి ఎవరైనా బద్రీనాథ్ వెళితే.. అక్కడ నా పేరుపై ఉన్న ఆలయాన్ని దర్శించండి. అలాగే ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనూ నా ఫొటో పెట్టి, దానికి పూల మాలలు వేసి పూజ చేస్తుంటారు. అక్కడ నన్ను అందరూ ‘దండమమాయి’ అని పిలుస్తుంటారు. నిజంగా ఈ విషయం తెలిసి నేనే ఆశ్చర్యపోయాను. నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా? అని నేనే నమ్మలేకపోయాను. నా మాట నమ్మకపోతే పలు మీడియాల్లో కూడా దీనిపై వార్తలు వచ్చాయి. కావాలంటే మీరు వాటిని చదవవచ్చు.

Also Read- OTT Movies: ఏప్రియల్ 24న ‘లూసిఫర్ 2’నే కాదు.. ఆ స్టార్ హీరో సినిమా కూడా!

ఇక సౌత్ విషయానికి వస్తే.. సౌత్‌లో నేను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి స్టార్స్‌తో కలిసి నటించాను. ప్రస్తుతం నాకు సౌత్‌లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. నా అభిమానులందరూ సౌత్‌లోనూ ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నాను. అది నాకు రెండో ఆలయంగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు, తనకున్న ఆలయానికి వచ్చే వారంతా తన ఆశీర్వదాలు కూడా తీసుకుంటారని ఊర్వశి చెప్పిన మాటలు విని అంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. డౌటే లేదు.. ఇది కచ్చితంగా పిచ్చే.. మంచి మెంటల్ డాక్టర్‌ని కలువు అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?