OTT Movies: థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గించేశారు. ఇప్పుడే సినిమా విడుదలైన నాలుగు వారాలు అంతకంటే తక్కువ టైమ్‌లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. నాలుగు వారాలు ఆగితే ఓటీటీలో చూసుకోవచ్చు కదా.. అని ప్రేక్షకుల మైండ్ సెట్ మారుతుంది. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్‌కు మాత్రం వారి హీరోల సినిమాలను థియేటర్లలో చూడక తప్పదు. అది వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కూడా. అందుకే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను నడిపిస్తుంది ఎవరయ్యా అంటే, కచ్చితంగా ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్సే అని చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ కూడా స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలోనే చూసి, నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు.
Also Read- Lokesh Kanagaraj: యువ హీరో శ్రీరామ్ హెల్త్‌పై లోకేశ్ కనగరాజ్ పోస్ట్.. అసలు శ్రీరామ్ ఎవరు?
ఇక స్టార్స్ అయినా, వేరే చిన్న హీరోలైనా సరే.. సినిమాలో కంటెంట్ ఉండి, పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. అప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. లేదంటే, ఎలాంటి హీరో సినిమా అయినా సరే.. పక్కన పెట్టేస్తున్నారు. ఓటీటీలలో చూసేస్తున్నారు. అందుకే థియేటర్లలో ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఓటీటీలలో బీభత్సమైన ఆదరణను రాబట్టుకుంటున్నాయి. సరే ఇదంతా ఎందుకులే గానీ, ‘లూసిఫర్’కి సీక్వెల్‌గా వచ్చిన ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2 Empuraan) రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. కాకపోతే సినిమా ఉన్న కంటెంట్‌పై కాంట్రవర్సీ నెలకొనడంతో చిత్రయూనిట్ మొత్తం సారీ చెప్పక తప్పలేదు.
L2: Empuraan will be streaming from 24 April only on JioHotstar. #Empuraan #JioHotstar #EmpuraanOnJioHotstar #PrithvirajSukumaran #MalayalamCinema #Mollywood #EmpuraanMovie #Lucifer2 #EmpuraanL2 #L2E pic.twitter.com/ABTh6suEnZ
— Mohanlal (@Mohanlal) April 17, 2025
చిత్ర హీరో మోహన్ లాల్ కూడా సారీ చెప్పారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సారీ చెప్పారు. ఇక థియేటర్లలో మంచి స్పందనను రాబట్టుకుని కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24న ‘ఎల్ 2: ఎంపురాన్’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో ఈ సినిమా ట్యాగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమా కూడా అదే రోజు ఓటీటీలోకి వస్తోంది. అదేం సినిమా అని అనుకుంటున్నారా?
One night. No rules. Only survival. A night that will change everything. 🔥#VeeraDheeraSooranOnPrime, April 24 pic.twitter.com/os8pfrjyUJ
— prime video IN (@PrimeVideoIN) April 18, 2025
థియేటర్లలో ‘ఎల్ 2: ఎంపురాన్’కి పోటీగా వచ్చిన చియాన్ విక్రమ్ నటించిన సినిమా ‘వీర ధీర శూరన్’.. ఇప్పుడు ఓటీటీలోనూ పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘వీర ధీర శూరన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌కి సంబంధించి కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 24న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read- Single Song: దిల్ రాజుని అలా.. అల్లు అరవింద్‌ని ఇలా.. ఆ స్టెప్ అరవింద్‌దేనా?
దీంతో ఏప్రిల్ 24న ఓటీటీ ప్రేక్షకులు పండగ చేసుకునేలా స్టార్ హీరోల సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘వీర ధీర శూరన్’ (Veera Dheera Sooran) విషయానికి వస్తే.. ప్రస్తుతం పార్ట్ 2గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా థియేటర్ ప్రేక్షకులను అలరించలేదు. కానీ ఓటీటీలో ఈ సినిమా మంచి స్పందనను రాబట్టుకుంటుందని టీమ్ భావిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు