Naa Anveshana On Aghori (Image Source: Twitter)
Viral

Naa Anveshana On Aghori: అఘోరీని చీల్చి చెండాడిన నా అన్వేష్.. ఇది మామూలు రోస్టింగ్ కాదు భయ్యా!

Naa Anveshana On Aghori: లేడీ అఘోరీ ప్రేమ, పెళ్లి వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. శ్రీవర్షిణి అనే యువతిని అఘోరీ (Lady Aghori) పెళ్లి చేసుకోవడం.. మరో యువతి తానే మెుదటి భార్య అంటూ బయటకు రావడం అందరినీ షాక్ కు గురిచేసింది. అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్న అఘోరీపై చర్యలు తీసుకోవాలంటూ శివ సాధువు శివ రుద్ర స్వామి.. పోరాటానికి సైతం దిగారు. ఈ క్రమంలోనే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్  (Naa Anvesh) సైతం అఘోరీ – శ్రీవర్షిణి (Sri Varshini) వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరిపై సంచలన ఆరోపణలు చేశారు.

‘అఘోరీ ప్రపంచ వింత’
లేడీ అఘోరీ వ్యవహారంపై యూట్యూబ్ లో ఓ స్పెషల్ వీడియో చేసిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. అందులో కీలక ఆరోపణలు చేశారు. లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ సైతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడని ఆరోపించారు. శ్రీనివాస్ ఒక ప్రపంచ వింతన్న అన్వేష్.. అతడు అఘోరీ, నాగ సాధువు, మహిళ, హిజ్రాలలో ఏ ఒక్కటి కాదని తేల్చి చెప్పారు. అతడు నిఖార్సైన మగాడు అంటూ తన వీడియోలో వ్యాఖ్యానించారు.

‘హిజ్రాలను మోసం చేశాడు’
అఘోరీ.. అసలు ఆడ మనిషిగా ఎలా మారారో కూడా నా అన్వేష్ తన వీడియోలో చెప్పుకొచ్చారు. వాస్తవానికి అతడు సాధారణ మగవాడేనని.. అయితే ఓ కారణం చేత అతడి ప్రైవేటు పార్ట్ తీసేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే పేదవాడు కావడంతో ముంబై పారిపోయి అక్కడి హిజ్రాలను చెంతకు చేరాడని అన్వేష్ అన్నారు. తానూ హిజ్రానే అని మోసం చేసి వారి సాయంతో ఆపరేషన్ చేయించుకున్నాడని పేర్కొన్నారు. అలా వారితో కలిసి రోడ్లపై తిరుగుతూ బిక్షాటన చేసేవాడని అన్నారు.

‘అందుకే అఘోరీగా మారారు’
ఓ రోజు టీవీలో నాగ సాధువు కాన్సెప్ట్ చూసి.. శ్రీనివాస్ బాగా అట్రాక్ట్ అయ్యాడని నా అన్వేష్ తెలిపారు. దాంతో ఎలాగైన ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో హిజ్రాగా సంపాదించిన డబ్బుతో ఓ కారు కొని.. దానిని సెటప్ మెుత్తం మార్చివేశాడని పేర్కొన్నారు. తనకు మంత్రాలు తెలుసు, తంత్రాలు తెలుసు అంటూ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడని స్పష్టం చేశారు. అటు మీడియా సైతం పెద్ద ఎత్తున కవరేజీ ఇవ్వడంతో లేడీ అఘోరీకి తిరుగులేకుండా పోయిందని, సంపాదన సైతం అదే రేంజ్ లో పెరిగిందని పేర్కొన్నారు.

Also Read: CM Revanth Japan Tour: జపాన్ లో సీఎం రేవంత్.. ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసింది..

డబ్బు కోసమే వర్షిణి వెళ్లింది!
లేడీ అఘోరీ కారు, అతడి వద్ద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ చూసి.. పేదరికంలో ఉన్న వర్షిణి అట్రాక్ట్ అయ్యిందని నా అన్వేష్ తెలిపారు. అఘోరీ వద్ద అందిన కాడికి దండుకుందామన్న ఉద్దేశ్యంతో ఆమె వెళ్లిందని ఆరోపించారు. లేడీ అఘోరీకి ఎలాగో ముల్లు లేదు గనుక ఆమె శీలానికి వచ్చిన బాధ ఏమిలేదని శ్రీవర్షిణి భావించిందని నా అన్వేష్ అన్నారు. కాబట్టి యూత్.. విలువైన సమ్మర్ హాలీడేస్ ను ఈ అఘోరీల గురించి తిలకిస్తూ కాలక్షేపం చేయవద్దని అన్వేష్ సూచించారు. కెరీర్ పై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!