Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: పర్సు కొట్టేశారు ఆపై.. రెండురోజులకు ఎంచేశారంటే!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Crime News: బస్సులో వెళుతుండగా మహిళ పర్సును కొట్టేసిన దొంగలు అందులో ఉన్న సెల్​ ఫోన్​ ద్వారా ఆమె బ్యాంక్​ ఖాతాను ఖాళీ చేసేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​ కు చెందిన ఓ ప్రైవేట్​ ఉద్యోగిని ఇటీవల తార్నాక నుంచి కాచిగూడ రావటానికి బస్సు ఎక్కింది. కాగా, దారిలో దొంగలు ఆమె పర్సును కొట్టేశారు. దాంతో తన పర్సు చోరీ అయ్యిందంటూ ఆమె కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీకి గురైన పర్సులో తన సెల్​ ఫోన్​ కూడా ఉన్నట్టు పేర్కొంది.

ఆ తరువాత రెండు రోజులకు తన బ్యాంక్​ ఖాతాను తనిఖీ చేసుకోగా లక్షా 4వేల రూపాయలు విత్​ డ్రా అయినట్టుగా ఆమెకు తెలిసింది. బ్యాగ్ తోపాటు చోరీకి గురైన ఆమె సెల్​ ఫోన్​ లో ఆన్​ లైన్​ బ్యాంకింగ్​ కు సంబంధించిన పాస్​ వర్డులు, ఏటీఎం కార్డు నెంబర్​ తదితర వివరాలు ఉండటంతో వాటి ద్వారా దొంగలు బ్యాంక్​ ఖాతాలోని నగదును ఖాళీ చేసినట్టుగా తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మొబైల్​ ఫోన్లలో ఆన్​ లైన్​ బ్యాంకింగ్ కు సంబంధించిన పాస్​ వర్డులు, ఏటీఎం కార్డుల నెంబర్లు స్టోర్​ చేయవద్దని సైబర్​ క్రైం పోలీసులు సూచించారు. ఒకవేళ స్టోర్​ చేసినా ఫోన్​ చోరీ అయినా, పోయినా వెంటనే బ్యాంక్​ సిబ్బందిని అలర్ట్​ చేసి ఎలాంటి లావాదేవీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Also Read: Viral News: ఇదేం గడియారంరా బాబు.. పిల్లాడివే కానీ, చించేశావ్!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ