Match Fixing in IPL 2025 (Image Source: Twitter)
స్పోర్ట్స్

Match Fixing in IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. తెరపైకి ఫిక్సింగ్.. కథ నడిపింది హైదరాబాదీనే..

Match Fixing in IPL 2025: ప్రస్తుతం దేశంలో ఐపీఎల్-2025 ఫీవర్ నడుస్తోంది. అన్ని జట్లు నువ్వా నేనా అన్న రీతిలో మైదానంలో తలపడుతున్నాయి. ప్రతి రోజూ ఉత్కంఠగా మ్యాచ్ లు తిలకిస్తూ క్రికెట్ లవర్స్ ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ఐపీఎల్ ను గతంలో బెట్టింగ్ భూతం వెంటాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోమారు ఐపీఎల్ కు సంబంధించి బెట్టింగ్ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై బీసీసీఐ (BCCI) స్వయంగా ఓ ప్రకటన చేసింది.

ప్లేయర్లతో రాయబారాలు
ఐపీఎల్ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, నిర్వాహకులకు బీసీసీఏ కీలక హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ బిజినెస్ మెన్ (Hyderabad Business Man)తో జాగ్రత్త అంటూ అప్రమత్తం చేసింది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి.. ప్లేయర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. ఫిక్సింగ్‌ కోసం ఖరీదైన గిఫ్ట్‌లు, జ్యూయలరీ ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ టీమ్‌లు బస చేసే హోటళ్లకు వెళ్లి అతడు రాయబారాలు నడుపుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు యాంటీ కరెప్షన్ సెక్యూరిటీ యూనిట్‌ – ACSU సూచనలు వచ్చినట్లు స్పష్టం చేసింది.

Also Read: CM Revanth Japan Tour: జపాన్ లో సీఎం రేవంత్.. ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసింది..

5 టీమ్స్ తో సంప్రదింపులు
ఐపీఎల్ లో హాట్ ఫేవరేట్ టీమ్స్ గా ఉన్న ఐదు జట్లను సదరు వ్యాపారి కాంటాక్ట్ చేసినట్లు బీసీసీఐ ఆధారాలు సంపాదించింది. కాగా ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని వారు కోరారు. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్త ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు వ్యాపార వేత్తలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం ఆ వ్యాపారవేత్త ఎవరో పోలీసులు వెల్లడించే ఛాన్స్ ఉంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు