Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన అవరం లేదు. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సరసన నటించిన తమన్నా, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. ఈ మధ్య బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమ, సహజీవనం అంటూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ఈ విషయంలో విజయ్ వర్మను అదృష్టవంతుడని అంతా అనుకున్నారు. కానీ, వారి ప్రేమ వ్యవహారం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. వారి ప్రేమ ముగియడానికి కారణం ఏమిటనేది తెలియదు కానీ, ఈ విషయంలో ఇద్దరూ తలో మాట చెబుతున్నారు. వారిపై ప్రేమ, వ్యవహారాలపై ఒక వారం, పది రోజుల పాటు వార్తలు నడిచాయి. మళ్లీ ఎవరి పనిలో వారు బిజీ అయ్యారు.
Also Read- Lavanya Controversy: హైడ్రామా అనంతరం.. లావణ్యకు షాక్!
ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ‘ఓదెల 2’ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో, తమన్నా నటనకు మాత్రం నీరాజనాలు పడుతున్నారు. ఇందులో తమన్నా తన నటనతో అందరినీ మెప్పించిందనేలా టాక్ వినబడుతుంది. తమన్నా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లిందని అంటున్నారు. కాకపోతే, కొత్తదనం లేని కథ, అలాగే ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్‌గా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తమన్నా సింప్లిసిటీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. కారణం ఆమె తనతో ఫొటోలు దిగడానికి వచ్చే వారి పట్ల ఆమె వ్యవహరించే తీరుకు అంతా ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా కారులో వెళ్లేటప్పుడు ఫ్యాన్స్ కనిపిస్తే, ఆగి మరీ వారితో ఫొటోలు దిగుతూ ఉండే వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఈవెంట్‌కి వచ్చిన వారితో ఆమె ఎంతో ఓపికగా ఫొటోలు దిగి, మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు.
Also Read- Star Director: ప్రభాస్ వర్షం మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న వీడియో
జబర్దస్త్‌కు చెందిన నూకరాజుతో పాటు ఇంకా సెట్‌లో ఉన్న ఎందరో తమన్నాతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారందరితో తమన్నా నవ్వుతూ ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, తమన్నా అభిమానులందరూ ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటూ, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటుంది కాబట్టే అందరూ ఆమెను ప్రేమిస్తుంటారని కొనియాడుతున్నారు. ఈ ఫొటోలతో తమన్నా పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక తమన్నా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లలో ఆమె బోల్డ్‌గా నటిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. సినిమాలపరంగా ప్రస్తుతం తమన్నా నటించిన ‘ఓదెల 2’ విడుదల కాగా, బాలీవుడ్‌లో చేస్తున్న ‘రైడ్ 2’ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇవి కాకుండా ‘రేంజర్’ అనే సినిమాకు ఆమె ఓకే చేసి ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు