Star Director: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుబలి ముందు వరకు సాధారణ హీరోగా ఉన్న యంగ్ రెబల్ స్టార్, ఆ తర్వాత మొత్తం మారిపోయింది. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 పెద్ద విజయం సాధించడంతో ప్రభాస్ వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఒకప్పుడు డైరెక్టర్ కోసం ప్రభాస్ ఎదురుచూసేవాడు కానీ, ఇప్పుడు డార్లింగ్ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ హీరో ఒక్క సినిమా తీస్తే చాలు, కొన్ని వేల కుటుంబాలకు ఏడాది పాటు పని దొరుకుతుంది. ఇక సలార్ మూవీతో పాత రికార్డులన్నీ బ్రేక్ చేసి, కొత్త రికార్డ్స్ ను క్రియోట్ చేశాడు. అయితే, ప్రభాస్ కి సంబందించిన ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Gold Rate Today : షాకిస్తున్న గోల్డ్.. నేడు రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు?
ప్రభాస్ ఓల్డ్ మూవీలో ఓ స్టార్ డైరెక్టర్ ఉన్నాడంటూ వీడియోతో పాటు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఇది వినడానికి షాకింగ్ లా ఉన్నా ఇదే నిజం. ఆ సినిమా ఎదో కాదండి. ప్రభాస్ ని హీరోగా నిలబెట్టిన “వర్షం ” ( Vrasham) చిత్రం. దివంగత డైరెక్టర్ శోభన్ దర్శకత్వం వహించిన వర్షం మూవీలోని కోపమా నా పైనే పాటలో వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. దీనికి సంబందించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Gaddar Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ.. నామినేషన్స్ వివరాలివే!
ఈ వీడియో పై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు. ప్రభాస్ , వంశీ పైడిపల్లి ఇద్దరు స్నేహితులా.. ఇంత వరకు ఎక్కడ కూడా బయటకు రాలేదు. ఇది చాలా షాకింగ్ లా ఉంది అని ఒకరు కామెంట్ చేశారు. వామ్మో ఇది నిజమో కాదో అని రెండు మూడు సార్లు చూశా.. ఆయనే వంశీ నే అని చూడగా చూడగా అర్థమైందని మరొకరు రాశారు. ఇంకొందరు ” వంశీ ఏంటి అలా ఉన్నడేంటి.. డైరెక్టర్ కాకముందే ఇలా యాక్ట్ చేశాడా “అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు