Money Saving Tips: ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏ పని జరగదు. అడుగు తీసి బయట పెట్టినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేవరకూ జరిగే ప్రతీ వ్యవహారం డబ్బుతో ముడి పడి ఉన్నదే. విచ్చల వీడిగా పెరిగిన ఖర్చులు, ఆకాశాన్నంటిన నిత్యవసరాల కారణంగా మనిషి జీవితం నానాటికి ఆర్థికంగా మరింత భారం అవుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూవారీగా చేసే కొన్ని వృథా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా కొంత వరకూ డబ్బును భవిష్యత్ అవసరాలకు దాచుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే నెలలో కనీసం రూ.10,000 వరకూ ఆదా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
క్రెడిట్ కార్డులకు స్వస్థి
ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డు (Credit Cards) లను ఉపయోగిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా వాటిని వినియోగిస్తూ ఆర్థిక భారాన్ని తమ స్వహస్తాలతో మీద వేసుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తే.. ఆర్థికంగా మీరు మరో మెట్టు ఎక్కినట్లేనని నిపుణులు సూచిస్తున్నారు. నెలలో దాదాపు రూ.10,000 వరకూ ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు.
సిగరేట్లకు చెక్
ఈ రోజుల్లో చాలా మందికి సిగరేట్ల (Cigarette) కోసం అధిక మెుత్తంలో ఖర్చు చేస్తున్నారు. రోజుకు రూ.100 నుంచి రూ.200 వరకూ సిగరేట్ తాగడానికే తగలేస్తున్నారు. అయితే ఈ అలవాటు ఏమాత్రం ప్రోత్సహించేది కాదని నిపుణులు సూచిస్తున్నారు. సిగరేట్ అలవాటును మాన గలిగితే నెలలో కనీసం రూ.6000 వరకూ ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆ డబ్బును పిల్లల భవిష్య నిధికి ఖర్చు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
మందుబాబులు మారాల్సిందే
ఈ దేశంలో వ్యసనాలకు అధికంగా ఖర్చు చేస్తున్న వారిలో మందుబాబులు ముందు వరుసలో ఉంటున్నారు. కొందరికి చుక్క లేనిదే పూట గడవటం కష్టంగా మారిపోతుంటుంది. అటువంటి వారు మద్యానికి (Alcohol) స్వస్థి పలికితే నెలకు రూ. 7,500-10,000 వరకూ ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆ డబ్బుని షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ తదితర పెట్టుబడి రంగాల్లో ఇన్ వెస్ట్ చేస్తే ఆర్థికంగా బలోపేతం అవుతారని సూచిస్తున్నారు.
Also Read: Rajiv Yuva Vikasam Scheme: ఈ తప్పు అస్సలు చేయవద్దు.. 5 ఏళ్లు ఈ పథకానికి దూరమే!
ఎమోషనల్ డెసిషన్స్ వద్దు
కొందరు ఎమోషనల్ పరిస్థితుల్లో డబ్బు గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. స్థాయికి మించి వాగ్దానాలు చేస్తూ.. అసలుకే ఎసరు తెచ్చుకుంటారు. నలుగురులో మెప్పు కోసం స్థాయికి మించి ఇల్లు కట్టుకోవడం, కార్లు కొనుగోలు చేయడం, లగ్జరీ లైఫ్ ను అనుభవించడం వంటి చేస్తుంటారు. ఏదైన తేడా జరిగితే ఇంటిల్లిపాది కష్టాల పాలు కావడం ఖాయమని నిపుణులు సూచిస్తున్నారు. కోపం, బాధ, ఆనందం, సంతోష సమయాల్లో ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్
కొందరు జంక్ ఫుడ్ కోసం అధిక మెుత్తంలో ఖర్చు చేస్తుంటారు. జంక్ ఫుడ్ (Junk Food) వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా జేబులకు చిల్లు పడే అవకాశముంది. ప్రస్తుత రోజుల్లో తమ ఆహార ఖర్చులో అధిక మెుత్తం జంక్ ఫుడ్ కే వెచ్చిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. కాబట్టి జంక్ ఫుడ్ బదులు.. ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన వంటకాలను కుక్ చేసుకోవడం ద్వారా నెలకు దాదాపు రూ.5000 – 10,000 వరకూ ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.