Rahul Gandhi news today
Politics

Viral: ‘తండ్రిని కోల్పోయిన గడ్డమీద ప్రేమ పంచుతున్న రాహుల్’

Rahul Gandhi: దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్నది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశ యువ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులో ఓ బాంబు పేలుడులో మరణించారు. ఎల్‌టీటీఈ చేపట్టిన ఆత్మాహుతి దాడిలో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 1991లో రాజీవ్ గాంధీ బలయ్యారు. నిఘా వర్గాలు వద్దని వారించినా ఆయన తమిళనాడు గడ్డ మీదికి వెళ్లాడు. టైగర్స్ పక్కా ప్లాన్‌తో ఆయనను హతమార్చింది. ఇప్పుడు ఈ చరిత్ర ఎందుకంటే తాజాగా రాహుల్ గాంధీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

రాహుల్ గాంధీ తమిళనాడు వెళ్లారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలవడానికి ముందు దారి మధ్యలోనే ఓ స్వీట్ షాపులో‌కి రోడ్డు దాటి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ మైసూర్ పాక్ స్వీట్లను కొన్నారు. తన ప్రియమైన సోదరుడు తిరు స్టాలిన్ కోసం స్వీట్లు కొంటున్నట్టు షాప్‌లో ఆయన చెప్పారు. కనిపించిన వారందరికీ కరచాలనం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. షాప్‌లోని వారంతా బయటికి వచ్చి ఆయనతో సెల్ఫీ ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో చివరిలో రాహుల్ గాంధీ ఆ స్వీట్ల పార్సిల్‌ను స్టాలిన్‌కు అందిస్తున్న దృశ్యం కూడా ఉన్నది. స్టాలిన్ ఆ స్వీట్లను సంతోషంగా అందుకుంటున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి తమిళనాడులో క్యాంపెయిన్ చేశారు. ‘తమిళనాడులోని క్యాంపెయిన్‌కు కొంత తీపిని జోడిస్తూ నా సోదరుడు స్టాలిన్‌కు స్వీట్లు కొనుక్కెళ్లాను’ అని రాహుల్ గాంధీ ఆ పోస్టులో పేర్కొన్నారు.

Also Read: ‘కేజ్రీవాల్‌కు రూ. 50 కోట్లు ఇచ్చా.. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తా.. ’

ఇదే వీడియోను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. చెన్నైలో రాహుల్ పర్యటిస్తున్న వేళ ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుందని తెలిపారు. ఆయన సడెన్‌గా రోడ్డు దాటి స్వీట్ షాప్‌లోకి వెళ్లి డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు బహూకరించడానికి రాహుల్ గాంధీ స్వీట్లు కొన్నారని పేర్కొన్నారు. ఒకనాడు ఇదే గడ్డపై తన తండ్రిని రాహుల్ గాంధీ కోల్పోయాడని, ప్రేమ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని విశ్వసించే బలమైన నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ ప్రేమను పంచుతున్నారని తెలిపారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్