Politics

Interview: రేవంత్ రెడ్డి రోర్స్.. ఒక్క షోతో హిందీ మీడియాలో తనదైన ముద్ర..!

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్‌గా మరోసారి తన పంచ్‌లతో ఓ ఇంటర్వ్యూలో ఆకట్టుకున్నారు. బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హిందీ మీడియాలో తనదైన ముద్ర వేసుకున్నారు. హిందీ మీడియా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉందనే ఆరోపణ ఉన్నది. చాలా వరకు కాంగ్రెస్ నాయకుల ఇంటర్వ్యూలు తీసుకోదు. వారిని హైలైట్ చేయదు. బీజేపీ, మోడీ అనుకూల పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఆ మీడియా సామ్రాజ్యం ఉన్నదని వాదిస్తుంటారు. కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదురుగాలిని తనవైపు మార్చుకున్నారని చెప్పాల్సిందే. ఆయన ఓ ప్రముఖ హిందీ టీవీ చానెల్‌ నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఆ టీవీ చానెల్‌కు డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యాఖ్యాత ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధానలు చెప్పి కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుల మన్ననలు పొందారు. పదునైన సమాధానాలు, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు అన్నీ వెరసీ అది ఓ ఎక్స్‌ప్లోజివ్ ఇంటర్వ్యూగా మారింది.

ఇండియా టీవీ చానెల్‌లో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీలను తూర్పారబట్టారు. ఈ ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి రోర్స్ (RRR) పేరుతో శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఇంటర్వ్యూ వివరాలు చూస్తే మాత్రం.. రేవంత్ రెడ్డి ఇమేజ్ తెలంగాణ సరిహద్దులను చెరపేసి దాటుతున్నదని చెప్పొచ్చు. బీజేపీ ద్వంద్వ నీతిని ఎక్స్‌పోజ్ చేశారు. బీఆర్ఎస్‌ను చీల్చిచెండాడారు. దేశం అభివృద్ధి చెందడానికి తన విజన్‌నూ పంచుకున్నారు.

Also Read: BJP : ఓవర్ కాన్ఫిడెన్స్..!?

రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి ఉంటారని ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఎవరి దయతో ఈ స్థాయికి రాలేదని, తన పోరాడి ముఖ్యమంత్రిని అయ్యానని వివరించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపింది. ‘మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు ఉన్నారు?’ అని అడగ్గా ‘ఇంకా ప్రతీకారం ప్రారంభమే కాలేదు. ఎలా తీసుకున్నానంటున్నారు?’ అని రేవంత్ రెడ్డి అడిగారు. ‘పులి ఇంకా లోపలే ఉన్నది. బయటికి రాలేదు’ అని అంటున్నారు కదా అని యాంకర్ పేర్కొనగా.. ‘అయితే రానివ్వండి. బందూక్ సిద్ధంగా ఉన్నది. ఒక్కటే బుల్లెట్‌తో పని అయిపోతుంది. నేను పిల్లి, కుక్కను కొట్టను. కొడితే పులినే కొడతాను.. రానివ్వండి’ అంటూ రేవంత్ రెడ్డి గర్జించారు.

‘మీ కార్యకర్తలు ప్యాంట్లు ఊడగొడతారని, బట్టలూడదీస్తారని బెదిరిస్తున్నారు’ కదా అని పేర్కొనగా.. ఇటుకకతో రాయితోనే సమాధానం చెప్పాలని రేవంత్ సమాధానం ఇచ్చారు. ‘మీరేమో జైలుకు పంపుతానని అంటున్నారు’ అని ప్రస్తావించగా.. ‘బిడ్డ ఒక చోట, కొడుకు మరో చోట.. కేసీఆర్‌కు వయసు మీద పడింది. అందుకే అందరినీ ఒకచోట కలిపి ఉంచడానికి చర్లపల్లి జైలులోనే డబుల్ బెడ్రూం కట్టిస్తా. నా మానవత్వాన్ని గుర్తించండి’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

Also Read: Phone Tapping : డేంజర్‌లో ప్రభాకర్ రావు.. ప్రాణానికి ముప్పు ఉందా..?

‘మోడీని రాహుల్ విమర్శిస్తుంటే మీరేమో బడే భాయ్ అంటున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘నేను వ్యవస్థలతో పోరాడదలుచుకోలేదు. ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి వ్యవస్థలను గౌరవిస్తాను. మోడీ ప్రధానమంత్రి. ఆ లెక్కన ఆయన అన్ని రాష్ట్రాలకు బడే భాయ్‌నే. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇచ్చి బడే భాయ్ అని నిరూపించుకోవాలన్నదే నా అభిప్రాయం. మేం ప్రభుత్వ అధినేతలుగానే ఆ వేదికను పంచుకున్నాం. రాహుల్ గాంధీ ఒక పార్టీకి సీనియర్ నాయకుడిగా సరైన వాదనలే చేస్తున్నారు. నేను ఒక సీఎంగా.. రాష్ట్ర ప్రజల బాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఆయనను బడే భాయ్ అని పిలిచాను.’ అని సమాధానం ఇచ్చారు.

‘అదానీని జేబు దొంగ అని రాహుల్ అంటారు. మీరేమో ఆయనకు 12,500 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు?’ అని అడగ్గా.. ‘ప్రభుత్వం నిర్మించిన విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులు, నవరత్నాలను ప్రధాని మోడీ చౌకగా అదానీకి అప్పజెబుతున్నాడు. కానీ, నేను అదానీ జేబులో నుంచి డబ్బులను ఇక్కడ పెట్టుబడి పెట్టిస్తున్నాను. అదీ తేడా. పెట్టుబడికి లూటీకి తేడా ఉంటుంది’ అని గట్టి సమాధానం ఇచ్చారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?