Naginonipalli village: హన్వాడ మండలం నాగినోనిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రం లో సౌకర్యాలు పరిశీలించారు.ధాన్యం కొనుగోలు ప్రారంభమైనప్పటి కి గన్నీ సంచులు లేక పోవడం గమనించి పౌర సరఫరాల సంస్థ నుండి వెంటనే గన్ని లకు ఇండెంట్ పెట్టి తీసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గన్ని లు అవసరం మేర66n సరఫరా చేయాలని పౌర సరఫరాల సంస్థ డి.ఎం.తో మాట్లాడి సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రం లో తేమ కొలిచే యంత్రంతో ధాన్యం తేమ శాతం పరిశీలించారు. నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం ను టాగ్ చేసిన మిల్లు కు రవాణా చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం కు వచ్చిన ధాన్యం తేమ శాతం పరిశీలించి రైతులకు వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేయాలని అన్నారు.
Also CM Revanth Reddy: సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్ హోటల్‌లో కలకలం
ధాన్యం కొనుగోలు కేంద్రం కు వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు.ధాన్యం కొనుగోలు కేంద్రం కు తూర్పార పట్టి, ఆర పోసి,తాలు,మట్టి లేని నాణ్యత ప్రమణాల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికితీసుకు వచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. అకాల వర్షాలు కురుస్తున్నoదున రైతులు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రం లో ధాన్యం శుభ్రం చేయుటకు ప్యాడీ క్లీనర్, టార్పా లిన్ లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట తహశీల్దార్ కిష్ఠా నాయక్,ఎం.పి.డి.ఓ యశోద,డి.పి.ఎం.చెన్నయ్య తదితరులు ఉన్నారు.
ఈ.జి.ఎస్.పనులు పరిశీలించిన కలెక్టర్
గ్రామం లో మహత్మా గాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కుంట పూడిక పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో కలెక్టర్ మాట్లాడి పనులు పరిశీలించారు. ఉపాధి కూలీలను ఏ సమయానికి వస్తున్నారు. ఎన్ని గంటలు పని చేస్తున్నారు. కొలతలు ఎలా తీస్తున్నారు అడిగి తెలుసుకున్నారు.ఉదయం 8 నుండి 11 గంటల వరకు పని చేస్తున్నట్లు ఉపాధి కూలీలు తెలిపారు.
వేసవి తీవ్రత కారణంగా వడగార్డుల దెబ్బ తగలకుండా పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. పని చేసే చోట ఓ.అర్.ఎస్.పాకెట్ లు సిద్ధంగా ఉంచాలని,ఇంటికి తీసుకు వెళ్ళ వద్దని సూచించారు.ఉపాధి పనులు గరిష్ట వేతనం వచ్చేలా కొలతలు పనులు చేపట్టాలని సూచించారు.కలెక్టర్ వెంట ఎం.పి.డి. ఓ యశోద, ఏ.పి.ఎం.తదితరులు ఉన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు