Kushboo Sundar
ఎంటర్‌టైన్మెంట్

Kushboo Sundar: ఇంజక్షన్ల అందం అన్నందుకు.. ఇచ్చిపడేసింది

Kushboo Sundar: ఖుష్బు సుందర్.. ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. ఇప్పటికీ నటిగా సినిమాలలో కనిపిస్తూనే ఉంది. పొలిటికల్‌గానూ బిజీగా ఉన్న ఖుష్బు సుందర్, ఈ మధ్య తన భర్తతో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘అరణ్మనై 4’లో ఆమె ఓ పాటలో కనిపించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు బుల్లితెరపై ఎంతో ఫేమస్ అయిన ‘జబర్ధస్త్’ షో‌కి జడ్జిగానూ ఆమె వ్యవహరిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఆమెకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ సంభవించినట్లుగా వార్తలు హైలెట్ అయ్యాయి. అందుకు అనుగుణంగా ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోలను ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసి, త్వరలోనే కోలుకుంటానని ప్రకటించింది. ఆమె చెప్పినట్లుగానే ఖుష్బు కోలుకుని, ఎప్పటిలానే మళ్లీ బిజీ లైఫ్‌‌ని లీడ్ చేస్తుంది.

Also Read- Shiva Rajkumar: రామ్ చరణ్ వ్యక్తిత్వం ఎంతో ఆకట్టుకుంది.. ‘పెద్ది’పై అదిరిపోయే అప్డేట్!

అయితే ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పారో, లేదంటే కావాలని చేస్తుందో తెలియదు కానీ, తన ఆరోగ్యంపై.. కాదు కాదు తన శరీరంపై ఖుష్బూ భీభత్సమైన శ్రద్ధ పెట్టేశారు. భారీగా ఉన్న ఆమె ఆకారాన్ని క్రమక్రమంగా తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో ఆమె బాగా సన్నబడిపోయి, నాజూగ్గా తయారవుతుంది. అంతేనా, ఒకప్పటి హీరోయిన్‌లా మళ్లీ తనలో మార్పు కనిపిస్తుంది. అయితే ఈ మార్పును తనలోనే దాచుకోకుండా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్ల నోరుకు, చేతికి పని కల్పిస్తుంది.

తాజాగా ఆమె బాగా సన్నబడిపోయి, హీరోయిన్ లుక్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలకు బ్యాక్ టు ద ఫ్యూచర్ అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలలో ఆమె షిమ్మరీ డ్రస్‌లో హెయిర్ లూజ్‌గా వదిలి ప్రజంట్ హీరోయిన్లను తలపించేలా కనిపిస్తుంది. అంతే, ఇక నెటిజన్లు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. కొందరు మీ లుక్ అద్భుతంగా ఉందని అంటుంటే, కొందరు మాత్రం మీరు ఎంత ట్రై చేసినా, ముఖంలో ఆ ముడతలు మీ ఏజ్‌ని తెలియజేస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం హద్దులు దాటి ఖుష్బు సుందర్‌కు షాకిచ్చే కామెంట్ చేశాడు.

Also Read- Vijayashanthi: పవన్ సతీమణి అన్నాపై ట్రోల్స్.. రాములమ్మ షాకింగ్ పోస్ట్

మీరు ఇంజక్షన్ల వల్లే ఇలా సన్నబడ్డారని తెలుస్తుంది. ఆ ఇంజక్షన్ ఏదో మీ ఫాలోయర్స్‌కి కూడా చెప్పవచ్చు కదా. వాళ్లంతా మీలాగే అందంగా మారతారు అంటూ బాడీ షేమింగ్ చేస్తూ విమర్శనాత్మకంగా పెట్టిన పోస్ట్‌కు ఖుష్బూ కూడా తగ్గలేదు.. ఇంకా చెప్పాలంటే ఇచ్చిపడేసింది. ‘‘మీ బాధేంటో నాకు అర్థం కావడం లేదు. మీ ముఖాలు సోషల్ మీడియాలో చూపించడానికి కూడా భయపడతారు. అంత చెండాలంగా మీ ముఖాలు ఉంటాయి. పాపం, మిమ్మల్ని కన్నవాళ్లను తలుచుకుంటేనే నాకు జాలేస్తుంది’’ అంటూ సదరు నెటిజన్‌కు ఖుష్బూ కౌంటరిచ్చింది. ఆమె కౌంటర్‌కు నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు