ఆంధ్రప్రదేశ్: AP Rains: రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన అన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టిపరిస్తితులలోను చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మంగళవారం శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం, గురువారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు,ప్రకాశం, నంద్యాల,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Also Read: Central Minister on YCP: త్వరలోనే జైలుకు పోతావ్.. వైసీపీ సీనియర్ నేతకి కేంద్ర మంత్రి వార్నింగ్!
నేడు వైఎస్సార్ జిల్లా వేంపల్లి, కర్నూలు జిల్లా వగరూరులో 41.8°C, నంద్యాల జిల్లా ఆలమూరులో41.7°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1°C, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి 41°C, అధిక ఉష్ణోగ్రతలు నమోదైందయ్యాయని ఆయన తెలిపారు. 47 మండలాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయిందన్నారు.